India vs Hong Kong Playing 11 out: ఆసియా కప్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హాంకాంగ్ కెప్టెన్ నిజఖత్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. యూఏఈపై ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం అని నిజఖత్ చెప్పాడు. మరోవైపు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చామని, రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
తొలి మ్యాచ్‌లో పటిష్టమైన పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సూపర్-4లో స్థానం దక్కించుకోవాలని చూస్తోంది. భారత్ ఫామ్ చూస్తే ఈ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న టీమిండియాను హాంకాంగ్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఆసియా కప్ 2022లో హాంకాంగ్‌కు ఇదే మొదటి మ్యాచ్. పటిష్ట టీమిండియాపై విజయం సాధించాలని నిజఖత్ సేన చూస్తోంది.
A look at #TeamIndia’s playing today. 📌
1 change as Hardik Pandya has been rested and Rishabh Pant replaces him. https://t.co/9txNRez6hL… #INDvHK #AsiaCup2022 pic.twitter.com/jLYqBBja3R
— BCCI (@BCCI) August 31, 2022
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తిక్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్.
హాంకాంగ్: నిజఖత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ ముర్తజా, బాబర్ హయత్, కించిత్ షా, ఇజాజ్ ఖాన్, స్కాట్ మెక్‌కెచ్నీ, జీషన్ అలీ, హరూన్ అర్షద్, ఎహసాన్ ఖాన్, అయుష్ శుక్లా, మహమ్మద్ ఘజన్‌ఫర్.
Also Read: Malaika Arora Crush: అర్జున్ కపూర్ కాకుండా.. మరో హీరోపై కన్నేసిన మలైకా అరోరా!
Also Read: Tarun on SSMB28: మహేష్ బాబు సినిమాలో తరుణ్.. అసలు విషయం చెప్పేశాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి