IND Playing 11 vs HK Asia Cup 2022: ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట జట్టును ఓడించి టోర్నీలో బోణి కొట్టిన భారత్.. నేడు పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. దుబాయ్ ఇంటెర్నేష్నల్ స్టేడియంలో బుధవారం రాత్రి 7.30లకు మ్యాచ్ ఆరంభం కానుంది. క్వాలిఫయర్‌గా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన హాంకాంగ్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఇటీవలి కాలంలో హాంకాంగ్ నిలకడగా ఆడుతోంది. అందుకే భారత్ కూడా అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగనుంది. మ్యాచ్ నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో టీమిండియా మేనేజ్మెంట్ లెఫ్ట్, రైట్ కాంబోను బరిలోకి దించాలని చూస్తోందట. దాంతో రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. అయితే రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. పంత్ స్థానంలో సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ఫస్ట్‌డౌన్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ వస్తాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన కోహ్లీ.. ఈ మ్యాచులో కనీసం హాఫ్ సెంచరీ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 4, 5, 6 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆడతారు. ఇక 7వ స్థానంలో ఫినిషర్ దినేష్ కార్తీక్ ఆడతాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. హాంకాంగ్‌తో మ్యాచులో అర్షదీప్ సింగ్ ఆడడం ఖాయం అయినా.. అవేశ్ ఖాన్ మాత్రం డౌటే. అవేశ్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. యుజ్వేంద్ర చహల్ పక్కాగా ఆడనున్నాడు.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజా, దినేష్ కార్తీక్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
Also Read: Gold Price Today: పండగ పూట స్వల్పంగా పెరిగిన పసిడి ధర... ఎంత పెరిగిందంటే..
Also Read: Malayalam Hero in Mahesh film: ఏకంగా మళయాళ హీరోను రంగంలోకి దించుతున్న త్రివిక్రమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి