Pak Semifinal Stint: ఆ అసాధ్యాలు సుసాధ్యమైతే పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవమా

Pak Semifinal Stint: ఐసీసీ ప్రపంచకప్ 2023లో  ఫలితాలు అంతు చిక్కడం లేదు. అసాధ్యం సుసాధ్యమౌతున్నాయి. పసి కూనలు హేమాహేమీల్ని మట్టి కరిపిస్తున్నాయి. పాకిస్తాన్, ఇంగ్లండ్ లాంటి జట్లు పాయింట్ల పట్టికలో అడుగున పడిపోయాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 28, 2023, 07:43 PM IST
Pak Semifinal Stint: ఆ అసాధ్యాలు సుసాధ్యమైతే పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవమా

Pak Semifinal Stint: ప్రపంచకప్ 2023లో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పాకిస్తాన్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికీ కొన్ని అద్భుతాలు జరిగితే పాకిస్తాన్ సెమీస్ ఆశలుంటాయంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఆ సాధ్యాసాధ్యాలేంటో తెలుసుకుందాం..

ప్రస్తుతం ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు టాప్ 4లో ఉన్నాయి. ఇక 5వ స్థానంలో శ్రీలంక ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండింట గెలిచిన పాకిస్తాన్ 4 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో ఆడాల్సి ఉంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపు శూన్యమనే అంటున్నారు. అయితే అసాధ్యం సుసాధ్యమైతే, అద్భుతాలు జరిగితే మాత్రం పాకిస్తాన్ సెమీస్ అవకాశాలున్నాయంటున్నారు. అది జరగాలంటే..అంటే పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే

పాకిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌లు అంటే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై గెలిచి తీరాలి. పది పాయింట్లకు చేరుకోవాలి. ఈ మూడు మ్యాచ్‌లతో రన్‌రేట్ గణనీయంగా మెరుగుపర్చుకోవాలి. 

ఇక 8 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మిగిలిన అన్ని మ్యాచ్‌లు ఓడిపోవాలి. నాలుగేసి పాయింట్లతో ఉన్న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 8 పాయింట్లు దాటకుండా ఉండాలి. ఇన్ని సమీకరణాలు దాటితేనే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అంటే పాకిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌లు కష్టపడి ఆడి గెలవడమే కాకుండా మిగిలిన జట్ల ఓటమిని కోరుకోవాలి. అదే సమయంలో ఇండియా టాప్ 2 నుంచి పడిపోకుండా ఉండాలి.

Also read: ICC World Cup 2023: సఫారీలపై పరాజయంతో పాక్ ప్రపంచకప్ 2023 కధ ముగిసినట్టేనా, సెమీస్ ఆశలు లేవా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News