Chennai Super Kings buy Shaik Rasheed For Rs 20 Lakh in IPL Auction 2023: కొచ్చి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 23) ఐపీఎల్ 2023 మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు శామ్ కరన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 వేలంలో విదేశీ స్టార్ ప్లేయర్స్ కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్, నికోలస్ పూరన్, బెన్ స్టోక్స్‌లకు సైతం భారీ మొత్తం దక్కింది. వీరితో పాటు భారత యువ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో షేక్ రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో గుంటూరు జిల్లా నుంచి ఐపీఎల్ లీగ్‌కు ఎంపికైన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2022లో అద్భుతంగా ఆడిన రషీద్.. సీఎస్‌కే టాలెంట్ స్కౌట్‌ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది ఎపీఎల్‌లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్.. 159 రన్స్ చేశాడు. అదేవిధంగా 2022 అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న యువ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. సెమీ ఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2023 మినీ వేలంతో షేక్ రషీద్ కల త్వరలోనే నెరవేరనుంది. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతోనే తన ఐపీఎల్ కెరీర్‌ను మొదలపెట్టనున్న రషీద్.. అన్ని కలిసొస్తే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి ఆడనున్నాడు. యువ టాలెంట్ వెలికితీయడంలో చెన్నై ప్రాంచైజీ ముందుంటుందన్న విషయం తెలిసిందే. చెన్నై తరఫున ఆడిన ఎందరో యువ ప్లేయర్స్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అవకాశం వచ్చి నిరూపించుకుంటే.. కాస్త ఆలస్యమైనా రషీద్ కూడా భారత జట్టులోకి వస్తాడు.
Shaik Rasheed is up next and he is SOLD to Chennai Super Kings for a base price of INR 20 Lakh 👏👏#TATAIPLAuction | @TataCompanies
— IndianPremierLeague (@IPL) December 23, 2022
గుంటూరు జిల్లాలోని ఒక మధ్య తరగతి కుటంబంలో షేక్ రషీద్ జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ అంటే అతడికి పిచ్చి. రోజూ క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్-14లో అరంగేట్రం చేశాడు. ఆపై అండర్-19లోనూ సత్తాచాటాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్‌కు ఎంపికకావడంతో గుంటూరులోని షేక్ రషీద్ ఇంట్లో భారీగా సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం షేక్ రషీద్ పేరు చక్కర్లు కొడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన గుంటూరు కుర్రోడు.. ఏకంగా ఎంఎస్ ధోనీతోనే ఆడే ఛాన్స్!
జాక్‌పాట్ కొట్టిన గుంటూరు కుర్రోడు
ఏకంగా ఎంఎస్ ధోనీతోనే ఆడే ఛాన్స్
భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా