T20 World Cup Updates: టీ20 వరల్డ్ కప్ అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. అన్ని జట్లు అస్త్రశస్త్రలతో బరిలో దిగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా తొలి మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్ పోరు ఆరంభం కానుంది. వరుసగా టీ20 సిరీస్ విజయాలతో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా రంగంలో దిగుతోంది. మరోవైపు సెమీస్‌కు చేరే జట్లను మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.
ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరతాలయని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అంచనా వేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టామ్ మూడీ కూడా అనిల్ కుంబ్లే ఎంపిక జట్లే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
టీమిండియా మాజీ ఓపెనర్ రాబిన్ ఊతప్ప మాత్రం భారత్ సెమీస్‌కు వెళ్లలేదన్నాడు. పాకిస్థాన్, ఆసీస్, ఇంగ్లండ్‌తో పాటు సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్ ఉందన్నాడు. పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశం లేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లెసిస్ అంచనా వేశాడు. ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు టాప్-4లో నిలుస్తాయన్నాడు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసీస్ సెమీస్ చేరే అవకాశం లేదని అంచనా వేశాడు. భారత్, పాక్, ఇంగ్లండ్ జట్లతో పాటు కివీస్ సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయన్నారు. ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు టాప్-4లో తలపడే ఛాన్స్ ఉందని బిల్లింగ్స్ ఎక్స్‌పెర్ట్ చేశాడు. చూడాలి మరి ఇందులో ఎవరి అంచనా నిజమవుతుందో..!
మరోవైపు టీ20 ప్రపంచకప్‌కు వరుణుడి భయం వెంటాడుతోంది. కీలక మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. నేటి నుంచి మొదలయ్యే ప్రపంచ కప్ మ్యాచ్‌లు.. వరుణుడు కరుణిస్తేనే ఆట సాజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గబ్బాలో టీమిండియా, కివీస్ మధ్య వార్మప్ మ్యాచ్ వర్షార్పణం అయింది.
ఇక క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఈ నెల 23న భారత్-పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ సమయంలో వర్షం కురవకూడదని ప్రార్థనలు చేస్తున్నారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు 50 వేల మందిపైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి మరో వీడియో లీక్.. మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్ చెప్పేశాడు?
Also Read: Weather Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్ తుఫాన్.. అప్రమత్తమైన అధికారులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook