Prithvi Shaw: BMW సిరీస్ లోని కారు కొన్న పృథ్వీ షా...రేటు ఎంతో తెలుసా?

భారత యువ ఆటగాడు పృథ్వీ షా ఖరీదైన కారును  కొనుగోలు చేశాడు. సుమారు 68 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 02:55 PM IST
Prithvi Shaw: BMW సిరీస్ లోని కారు కొన్న పృథ్వీ షా...రేటు ఎంతో తెలుసా?

DC opener Prithvi Shaw gifts himself a swanky BMW car: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల(ఎక్స్‌ షోరూం ధర) బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ గ్రాన్‌ టరిస్మో(BMW 6 Series Gran Turismo)ను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా(Social Media) వేదికగా పంచుకున్న 21 ఏళ్ల పృథ్వీ షా... కారు ముందు దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి మొదలై.. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం’’అంటూ ఉద్వేగభరిత కామెంట్‌ జత చేశాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PRITHVI SHAW (@prithvishaw)

మహారాష్ట్రలోని థానే(Thane)లో సాధారణ కుటుంబంలో జన్మించిన పృథ్వీ షా(Prithvi Shaw)... దేశవాళీ క్రికెట్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో ఈ ముంబై ఓపెనర్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్‌ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు.అంతేగాక లిస్టు ఏ క్రికెట్ ‌(పురుషులు)లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌(శ్రేయస్‌ అయ్యర్‌ గైర్హాజరీ)గా కూడా నిలిచాడు.

Also Read: Allu Arjun: శ్రీచైతన్య విద్యా సంస్థలకు Brand ambassador అల్లు అర్జున్

ఐపీఎల్ 2021(IPL 2021)లో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా 15 మ్యాచ్‌లలో 479 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలున్నాయి. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ యువ ప్లేయర్‌ తనకు తాను బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా ఇచ్చుకున్నాడు.

 

బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ స్పెసిఫికేషన్స్‌
*పెట్రోల్‌, డీజిల్‌ వర్షన్‌లో లభ్యం
*ఇంజిన్‌: 1995- 2993సీసీ
*టాప్‌ స్పీడ్‌: 220- 250 కేఎమ్‌పీహెచ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News