కరోనాపై పోరాటానికి రోహిత్ శర్మ భారీ విరాళం

మహమ్మారిపై పోరాటంలో సెలబ్రిటీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన వంతు సాయాన్ని అందించాడు.

Last Updated : Mar 31, 2020, 01:58 PM IST
కరోనాపై పోరాటానికి రోహిత్ శర్మ భారీ విరాళం

ముంబై: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో రాజకీయ, సినీ, క్రికెట్, వ్యాపార, ఇతర రంగాల సెలబ్రిటీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో కరోనాపై పోరాటానికి భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ  (Rohit Sharma) తన వంతు సాయాన్ని అందించాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం అందించినట్లు వెల్లడించాడు. ఈ మేరకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.  శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ (PMCaresFunds)కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, స్ట్రే డాగ్స్ కోసం రూ.5లక్షలు అందజేసినట్లు హిట్ మ్యాన్ రోహిత్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కరోనాపై పోరాడేందుకు శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, మహారాష్ట్ర సీఎం, అధికారులకు తోడుగా నిలవాలని సైతం పిలుపునిచ్చాడు రోహిత్ శర్మ.  రూ.51 కోట్ల భారీ విరాళం ప్రకటించిన BCCI 
 

కాగా, భారత క్రికెట్ బోర్డ్ నియంత్రణ మండలి (BCCI) కరోనాపై పోరాటానికి తమ వంతు సాయం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన బోర్డు బీసీసీఐ రూ.51 కోట్ల మేర భారీ విరాళాన్ని కరోనాపై పోరాటానికి అందజేయనుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తామంటే!

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

 

 

Trending News