వరల్డ్ కప్ ఫైనల్లోకి ఇంగ్లీష్ జట్టు ప్రవేశించింది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టు బంపర్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 49 ఓవరల్లో 223 పరుగులు మాత్రమే చేసింది. స్టిఫెన్ స్మిత్ (85), అలెక్స్ కేరీ (46) మినహా ఆసీస్ బ్యాట్స్ మెన్లలందరూ విఫలమ్యాయి. ఇంగ్లండ్ బౌలింగ్ విషయానికి వస్తే క్రిస్ వోక్స్, ఆదిల్ రహిద్ చెరో 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసి ఆసిస్ పతనాన్ని శాసించారు. ఫలితంగా ఆసీస్ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.
ఆసీస్ తన ముందు ఉంచిచిన 224 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 32.1 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (85), జానీ బెయిర్ స్టో (34) విజయానికి కావాల్సిన పటిష్టమైన పునాది వేయగా, కెప్టెన్ మోర్గాన్ (45), జో రూట్ (49) మిగతా పని పూర్తిచేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీయగా, కమ్మిన్స్ మరో వికెట్ దక్కించుకున్నాడు. తాజా విజయంతో ఫైనల్లో ప్రవేశించిన ఇంగ్లండ్ జట్టు..14న లాడ్స్ లో జరిగే ఫైనల్ పోరులో కివీస్ జట్టుతో తలపడనుంది. సొంత గండపై వరల్డ్ కప్ గెలిచే సువార్ణకాశం ఇంగ్లండ్ జట్టుకు దొరకడం ఆ దేశ క్రికెట్ అభిమానులు సంభరాలు చేసుకుంటున్నారు.