Glenn Maxwell: తండ్రైన ఆసీస్ స్టార్ క్రికెటర్...చిన్నారికి టామ్ క్రూజ్ సినిమా పేరు?

Maxwell Baby: ఆసీస్ స్టార్ బ్యాటర్, ఆల్ రౌండర్ మ్యాక్స్​వెల్ తండ్రయ్యాడు. మాక్స్ సతీమణి వినీ రామన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మ్యాక్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 10:31 PM IST
Glenn Maxwell: తండ్రైన ఆసీస్ స్టార్ క్రికెటర్...చిన్నారికి టామ్ క్రూజ్ సినిమా పేరు?

Maxwell Baby: ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్​ మ్యాక్స్​వెల్(Glenn Maxwell) తండ్రయ్యాడు. ఆయన భార్య వినీ రామన్ (Vini Raman) సోమవారం (సెప్టెంబరు 11)న పండంటి మగబిడ్డకు జన్ననిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మ్యాక్స్​వెల్ ప్రకటించాడు. తమ చిన్నారికి 'లోగన్ మావెరిక్ మ్యాక్స్​వెల్' (Logan Maverick Maxwell) అని పేరు పెట్టినట్లు ఇన్ స్టా వేదికగా మాక్స్ తెలిపాడు. దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు మ్యాక్స్ దంపతులకు సామాజిక మాధ్యమాల ద్వారు విసెష్ చెబుతున్నారు. 

మ్యాక్స్​వెల్ కు గతేడాది మార్చిలో వివాహమైంది. భారతీయ మూలాలున్న ఫార్మాసిస్ట్ వినీ రామన్ ను మాక్స్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి క్రిస్టియన్, హిందూ సంప్రదాయ పద్దతుల్లో జరిగింది. మాక్స్ భార్య వినీ రామన్ తను తల్లి కాబోతున్న విషయాన్ని ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. ఆమెకు తమిళ సంప్రదాయ పద్దతిలో సీమంతం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా వినీ రామన్.. మాక్స్ తనకు గిప్ట్ గా ఇచ్చిన ఉంగరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మ్యాక్స్​వెల్ తన ఆటతో ఆసీసీకు ఎన్నో విజయాలు అందించాడు. టీ20ల్లో ఇతడి రికార్డు అమోఘం. 98 టీ20 మ్యాచుల్లో ఇతడు 2159 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 233 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్.. 5988 రన్స్ చేశాడు. అంతేకాకుండా 107 వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు. 

Also Read: PAK Vs SL Highlights: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. చివరి బంతికి శ్రీలంక సంచలన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News