Weekly Horoscope 19 To 25 June: వారఫలాలు.. ఈ వారం లాభపడబోయే రాశులవారు వీరే!

Weekly Horoscope 19 to 25 June 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం అన్ని రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం మీ రాశి ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 07:29 PM IST
Weekly Horoscope 19 To 25 June: వారఫలాలు.. ఈ వారం లాభపడబోయే రాశులవారు వీరే!

Weekly Horoscope 19 to 25 June 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. గ్రహాలు సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందితే, మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వారపు జాతకాన్ని గ్రహాల గమనాన్ని బట్టి లెక్కిస్తారు.  ఈ నెలలో ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో.. ఈ వారం వారికి అదృష్టం వరించబోతుందో లేదో.. వారి జీవితాల్లో కలిగే లాభనష్టాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం రాశుల వారిగా జ్యోతిష్యం:

మేషం:
ఈ వారం మేష రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబం పట్ల కలిగి ఉన్న బాధ్యతను నెరవేర్చుతారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ వారం కలిసొస్తుంది. ఈ రాశి వారికి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శని తిరోగమనం కారణంగా ఈ రాశి వారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీని కారణంగా వీరు కొంత ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామితో ప్రేమ జీవితాన్ని గడుపుతారు. వీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  

వృషభం:

వృషభ రాశి వారు ఈ వారం తప్పకుండా శుభవార్తలు వింటారు. ఇంతకుముందు పెట్టుబడులు పెట్టిన వ్యాపారాల్లో భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా స్వయంగా వ్యాపారాలు పెట్టే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. ఈ వారం వృషభ రాశి వారు ఎవరితో అనుచితంగా ప్రవర్తించకూడదు. వీరు పేదవారికి సహాయం చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆఫీసులో మంచి గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా కష్టపడి పని చేయడం వల్ల ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇతర చోట్ల నుంచి కూడా ఆదాయ వనరులు పొందుతారు.

సింహ రాశి:
సింహ రాశి వారు ఈ వారం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర సూచిస్తున్నారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో వింతగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరు త్వరలోనే ఇంట్లో మంచి శుభకార్యాలు జరుపుకుంటారు. అంతేకాకుండా పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి వాటాల్లో నుంచి లాభాలు పొందుతారు. సింహ రాశి వారు ఈ వారం ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది.

కన్య రాశి:
కన్యా రాశి వారు ఈ క్రమంలో ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను పొందుతారు. వీరు కష్టపడి పనిచేయడం వల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారు కష్టపడి పనిచేయడం వల్ల సులభంగా విజయం సాధించడమే కాకుండా మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ వారం వీరు స్నేహితులతో బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా వీరు ఆనందమైన, ఉల్లాసమంతమైన జీవితాన్ని గడుపుతారు.

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News