Vinayaka Chavithi History: భారతీయలు జరుపుుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. పార్వతీపరమేశ్వరులు కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా (Vinayaka Chavithi) జరుపుకుంటారు. ఈ వినాయక చవితినే గణేష్ చతుర్థి, గణేష్ ఉత్సవ్ అనే రకరకాల పేర్లుతో పిలుస్తారు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు (ఆగస్టు 31, 2022) గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంత చతుర్థి నాడు (సెప్టెంబరు 09, 2022) ముగుస్తాయి. హిందూ పురాణాల ప్రకారం, వినాయకుడికి 108 పేర్లు కలవు.
ఈ గణేష్ ఉత్సవాలను భారత్ లో మెుదటిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31న వస్తుంది. ఇది పది రోజులపాటు జరుపుకునే పండుగ. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఉత్సవాలు జరగడం లేదు. ఈ సంవత్సరం భారీ ఎత్తున వేడుకలు జరుపుకునేందుకు దేశమెుత్తం సిద్దమైంది. ఇప్పటికే వినాయకుడి విగ్రహాలు కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. వినాయక చవితి నాడు విష్నేుశ్వరుడిని 21 రకాల పత్రాలతో పూజిస్తారు.
వినాయక జననం కథ
కైలాసంలో పార్వతీదేవి ఒకనాడు నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారుచేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి..ఎవ్వరినీ లోపలికి రానివ్వవద్దని చెప్తూంది. ఆ సమయంలోనే శివుడు అక్కడకు వస్తాడు. అడ్డుకోబోయిన బాలుడిని శిరచ్ఛేదనం చేస్తాడు. మహాదేవుడు చేసిన పనికి ఎంతో దుఃఖిస్తుంది. దీంతో శివుడు గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి బతికిస్తాడు. అప్పటి నుండే వినాయకుడు గజాననుడు అయ్యాడు. ఇతడి వాహనం అనింద్యుడనే ఎలుక.
Also Read: వినాయక చవితి రోజే సింహరాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశులవారికి లక్కే లక్కు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook