Venus Transit 2022: శుక్రుని అనుగ్రహం.. మరికొద్దిరోజుల్లో ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారట...

Venus Transit 2022: కుంభ రాశిలోకి శుక్రుని సంచారం ఈ 3 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. శుక్ర అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుందని చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 03:54 PM IST
  • కుంభ రాశిలోకి శుక్ర సంచారం
  • మేషం, మిథునం, మకర రాశి వారికి అదృష్టం
  • ఏ రాశి వారికి ఎలా కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోండి
Venus Transit 2022: శుక్రుని అనుగ్రహం.. మరికొద్దిరోజుల్లో ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారట...

Venus Transit 2022: జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మకరరాశిలో ఉన్న శుక్రుడు మార్చి 31 ఉదయం కుంభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు వృషభం, తుల రాశికి అధిపతిగా పరిగణిస్తారు. శుక్రుడు కుంభ రాశిలో సంచరించడం వల్ల ప్రధానంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ఆ మూడు రాశులేంటో.. వారికి కలిగే అదృష్టం, ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మేషం:

మేష రాశి వారి జాతకంలో శుక్రుడు పదకొండో స్థానంలో సంచరిస్తాడు. శుక్రుని సంచార సమయంలో మేష రాశి వారిపై దాని ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. క్రమంగా ఆర్థిక వృద్ది ఉంటుంది. డబ్బుకు కొదువ ఉండదు.

మిథునం:

మిథున రాశిలో శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం తొమ్మిదవ ఇంట్లో శుక్ర సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉపాధి, వ్యాపారంలో ఆర్థికంగా కలిసొస్తుంది. ఇల్లు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడులకు పూర్తి అనుకూల సమయం. 

మకరం:

మకర రాశిలో శుక్రుడు రెండో స్థానంలో సంచరిస్తాడు. మకర రాశి వారికి శుక్ర సంచారం మేలు చేస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. 

Also Read: Nimmala Rama Naidu: సైకిల్‌ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Also Read: Cockfight in Telangana: తెలంగాణలోనూ రహస్యంగా కోడి పందాలు.. 28 మంది అరెస్ట్.. ఎక్కడంటే.. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News