Benefit of cloves in astrology: రోజువారీ జీవితంలో లవంగాలను (cloves) గరం మసాలా లేదా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇది పూజలు, వివిధ నివారణలు మరియు ఉపాయాలలో కూడా ప్రముఖంగా ఉపయోగించబడుతుంది. ఇంట్లో సుఖసంతోషాలు, ధనం ఉండాలంటే లవంగాన్ని ఉపయోగించాలి.
లవంగం ఉపయోగాలు:
**జ్యోతిష్య శాస్త్రం (astrology) ప్రకారం, మీరు ప్రతిరోజూ ఉదయం ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు..ఆ దీపంలో 2 లవంగాలు వేసి హారతి ఇస్తే... అది ఇంటి ప్రతికూలతను తొలగిస్తుంది.
** రోగాలను దూరం చేసే ఔషధం: ఇంట్లో సభ్యునికి తరచుగా జబ్బులు వస్తున్నా లేదా ఇంట్లో గొడవలు జరుగుతున్నా 6-7 లవంగాలను పెనంపై కాల్చి ఇంట్లో ఏదో మూలన ఉంచాలి. ప్రతి 2 నుండి 4 రోజులకు ఇలా చేస్తూ ఉండండి. మరి కొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది.
**ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పరిహారం: కష్టపడి పని చేసినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే, 7 లవంగాలు, 7 ఎండుమిర్చి తలపై నుంచి ఎవరూ రాని ప్రదేశంలో విసిరేయండి. ఈ లవంగాలు మరియు నల్ల మిరియాలను నాలుగు దిక్కులలో వేయండి. ఆ తర్వాత వెనుదిరిగి చూడకండా వెళ్లిపోండి. కొద్దిరోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది.
** ఏదైనా పని పదే పదే చెడిపోతుంటే... లవంగాలు, యాలకులను తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ పని పూర్తి అవుతుంది.
Also read: Hindu Beliefs: సూర్యాస్తమయం తరువాత చేయకూడని పనులివే..లేకపోతే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook