Vastu Tips: ఇంట్లోని చిన్న చిన్న వస్తువులే మీ జీవితాన్ని మార్చేయవచ్చు, ఈ టిప్స్ పాటించండి

Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇంట్లో చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించే పరిస్థితి కల్పించవచ్చు. ఏ వస్తువులు ఎలాంటి ప్రభావం కల్గిస్తాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 13, 2023, 07:39 AM IST
Vastu Tips: ఇంట్లోని చిన్న చిన్న వస్తువులే మీ జీవితాన్ని మార్చేయవచ్చు, ఈ టిప్స్ పాటించండి

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో..వాస్తు శాస్త్రానికి కూడా అంతే ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలి, ఏవి ఉండకూడదనే వివరాలున్నాయి. ఇవి పాటించకపోతే దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. 

ఇంట్లో ప్రతి వస్తువుకు ఓ ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు ప్రకారం ఆ వస్తువు ఆ వ్యక్తి అదృష్ట దురదృష్టాల్ని కలగజేస్తుంది. సరైన దిశలో సరైన వస్తువులుంటే..ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, వృద్ధి ఉంటాయి. అదే సమయంలో కొన్ని వస్తువుల్ని తప్పుడు పద్దతిలో వినియోగించినా లేదా తప్పుడు ప్రాంతంలో ఉంచినా మూల్యం చెల్లించుకోవల్సిన వస్తుంది. అది ఎంతదూరముంటుందంటే..ఒక్కోసారి డబ్బుల్ని కనీసం చూడలేం కూడా. అలాంటి ఏ వస్తువులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో పరిశీలిద్దాం.

కత్తి

కత్తిని బట్టి ఆ ఇంట్లో పిల్లల పరిస్థితి, స్వభావం గురించి తెలుసుకోవచ్చు. కత్తిని కిచెన్‌లో ఎప్పుడూ తిరగేసి ఉంచాలి. అంటే పదునుగా ఉండే భాగం కిందివైపున ఉండాలి. ఇలా ఉంచడం వల్ల పిల్లల స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలకు ఉపయోగించే కత్తులు, కటార్లు ఉంచకూడదు. శారీరక నష్టాల్ని కలగజేస్తాయి. ఇంట్లో పెద్ద పెద్ద కత్తులుంటే వైవాహిక జీవితం నాశనం కావచ్చు.

ఫుట్‌మ్యాట్

ఫుట్‌మ్యాట్‌తో సంతోషం, సమస్య రెండూ ఉంటాయి. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఫుట్‌మ్యాట్ అనేది ఎప్పుడూ చిరిగిపోయుండకూడదు. దీనివల్ల వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఉదయం వేళ గుమ్మం వద్ద శుభ్రమైన ఫుట్‌మ్యాట్‌పై శంఖం, స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలుంచాలి. లేకపోతే ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి.

కత్తెర

సంబంధాల విషయంలో కత్తెర పాత్ర కీలకమైందిగా భావిస్తారు. సరిగ్గా ఉపయోగించకపోతే ఇంట్లో బంధాలు పాడవుతాయి. కత్తెరను ఎప్పుడూ కాగితం లేదా వస్త్రంతో చుట్టి ఉంచాలి. దీనివల్ల సంబంధాలు మెరుగుపడతాయి. అకారణంగా కత్తెర వాడకూడదు. దీనివల్ల ఇంట్లో విబేధాలు పెరుగుతాయి.

చీపురు

చీపురుని పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఎప్పుడూ చీపురుని దాచి ఉంచాలి. చీపురుపై కాళ్లు ఆన్చడం, పాడేయడం వంటివి అశుభ సూచకాలు. ఇంట్లో పాడైన చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. దీనివల్ల ఆర్ధిక సమస్యలు ఉత్పన్నమౌతాయి. సూర్యాస్తమయం తరువాత చీపురు ఊడ్వడం వల్ల నెగెటివ్ ఎనర్జీ, దరిద్రం ఉంటాయి. ఇంట్లో ముళ్లుండే మొక్కలు, మహాభారత చిత్రాలు, హింసాత్మక జంతువులు, ఏడుస్తున్న పిల్లల బొమ్మలు ఉండకూడదు. 

Also read: Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తరువాత సూర్య, గురు గ్రహాల యుతి, 3 రాశులకు తిరగనున్న దశ, ముట్టుకుంటే డబ్బులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News