vasant panchami 2022, know the significance : వసంత పంచమి పండుగను మాఘ శుక్ల పంచమి రోజున జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 5వ తేదీ శనివారం రానుంది. వసంత పంచమిన చదువుల తల్లి సరస్వతిదేవిని భక్తితో పూజిస్తారు. వసంత పంచమి (vasantha panchami) రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇక వసంత పంచమి పూజ తేదీ, ముహూర్తం.. వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.
వసంత పంచమి ముహూర్తం
ఈ సారి వసంత పంచమి ఫిబ్రవరి 5వ తేదీ శనివారం రోజున వస్తుంది. ఆ రోజు సరస్వతీ దేవిని (Saraswati Devi) పూజించడానికి తెల్లవారుజామున 03.47 నుంచి ముహూర్తం ప్రారంభం అవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 6వ తేదీ ఆదివారం ఉదయం 03:46 నిమిషాల వరకు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం... సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు సరస్వతీ దేవిని పూజించవచ్చు.
వసంత పంచమి రోజు సరస్వతీ అమ్మవారిని నిష్టతో పూజిస్తే.. అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చని భక్తుల విశ్వాసం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉదయమే స్నానం చేయండి. తర్వాత తెలుపు లేదా పసుపు దుస్తులు ధరించండి. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా సరస్వతీ పూజను ప్రారంభించండి.
పసుపు వస్త్రంపై సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని ఉంచండి. గంధం కుంకుమ, పసుపు, పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు, చక్కెర, మిఠాయిలు, పెరుగు, పాయసం ఇలా అమ్మవారికి ఇష్టపమైన వాటిని నైవేద్యంగా ఉంచండి. పూజ సమయంలో అమ్మవారిని స్తుతిస్తూ.. కుడి చేతితో తెల్ల చందనం, తెలుపు లేదా పసుపు పువ్వులు అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి కుంకుమ కలిపిన ఖీర్ నైవేద్యంగా పెట్టడం మంచిది. అలాగే 'ఓం సరస్వత్యై నమః' అనే మంత్రాన్ని జపిస్తూ సరస్వతీ అమ్మవారి పూజిస్తే ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు.
వసంత పంచమి ప్రాముఖ్యత
సరస్వతీ దేవి (Saraswathi) శుక్ల పక్షం ఐదో రోజున బ్రహ్మ నోటి నుంచి జన్మించిందని అని చెబుతారు. అందువల్ల వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని భక్తులు పూజిస్తారు. ఇక ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల చదువు, విజ్ఞానం లభించేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.
Also Read : Woman on Burj Khalifa: వామ్మో! బుర్జ్ ఖలీఫాపై నిలబడి.. అడ్వర్టైజ్‌మెంట్ వైరల్ వీడియో
వసంత పంచమిని శ్రీ పంచమి (Sri Panchami) అని కూడా అంటారు. వసంత పంచమి.. అక్షరాభాస్యం చేయించేందుకు, లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఎంతో అనుకూలమైనది. అలాగే వసంత పంచమి రోజున గృహ ప్రవేశాలు చేస్తే ఎంతో శుభప్రదంగా (Auspicious) ఉంటుంది.
Also Read : Paracetamol dose: పారాసిటమోల్ ఏయే వయస్సుల వారికి ఎంత డోస్ అవసరమో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook