Ugadi Rasi Phalalu in Telugu: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఎలా ఉంది.. ? వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయా.. ?

Ugadi Rasi Phalalu Simha Rasi 2024 -25: తెలుగు వాళ్లకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇపుడు తెలుసుకుందాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2024, 09:38 AM IST
Ugadi Rasi Phalalu in Telugu: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఎలా ఉంది.. ? వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయా.. ?

Ugadi Rasi Phalalu Simha Rasi 2024 -25: ఉగాది.. తెలుగు వారు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది. ఈ రోజు నుంచే తెలుగు నూతన యేడాది ప్రారంభం అవుతోంది. తెలుగు సంత్సరాల్లో క్రోధి 38వది. ముఖ్యంగా ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ ఉగాది.  ఈ క్రోది నామ సంవత్సరంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. అందులో 5వ రాశి అయిన సింహ రాశి వారికీ ఈ సారి ఎలా ఉండనున్నాయయో చూద్దాం..
సింహ రాశి .. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

సింహ రాశి వారికీ ఆదాయం.. 2, వ్యయం 14.. రాజ పూజ్యం 2, అవమానం 2

సింహ రాశి వారికీ ఈ యేడాది గడ్డు కాలమే అని చెప్పాలి. వీరికి అదృష్ట యోగం 25 శాతమే ఉంది.  ఈ రాశి స్త్రీ, పురుషాదులకు ధనము, కుటుంబ కారకుడైన బృహస్పతి 10 ఇంట ఉన్నాడు. రాహువు అష్టమంలో ఉండటం వల్ల ఈ రాశి వారికీ  జీవితం పోరాట సమయంగా ఉండును. శారీరకంగా మానసికంగా కాస్త ధృడంగా ఉండాల్సిన సమయం.  వీరికి జీవితంలో అనేక సంఘటనలు జరుగును. ప్రారంభం కొన్ని కష్ట, నష్టాలు ఉన్నా.. చివరకు రాజపూజ్యత, ఆదాయం బాగుండును. బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ యెక్క తెలివి తేటల వలన గడ్డు సమస్యల నుంచి బయటపడతారు. ఊహించని అద్బతు సంఘటనలు మీకు మేలు చేస్తాయి. కొన్ని ముఖ్య సంఘటనల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ సంవత్సరం ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదు. రాహువు, శని ప్రభావం వల్ల కొంత అసంతృప్తిని ఎదుర్కొటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భూ, గృహ వాహనాల విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.  వివాహా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహా రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు. రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చును. ప్రజల్లో అంతగా గుర్తింపు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తోన్న వారు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. స్ధిరాస్తుల విషయంలో అప్రమత్తత అవసరం.

సినిమా రంగంలోని వారు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే పోతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. సిమెంటు, ఇసుక, ఇనుముకు సంబంధించిన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వాములైన మనస్పర్ధలతో విడిపోతారు.
విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతోంది. చెడు స్నేహాలు, ఇతర పనుల కారణంగా వచ్చే మార్కుల్లో కోత పడుతోంది. పరీక్షల సమయంలో అప్రమత్తత అవసరం.

ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంటనే బాగుంటుంది. కొత్త ఋణాలు చేస్తారు. అప్పుల్లో ఊబిలో కూరుకుపోయే అవకాశాలున్నాయి.

స్త్రీలకు అత్యంత అనుకూలంగా ఉండదు. భార్య, భర్తల మధ్య సఖ్యత అవసరం. అనవరసర వాదనలకు దూరంగా ఉండండి. మొత్తంగా మీద ఈ రాశి స్త్రీ, పురుషాదులకు గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.  ఈ రాశి వారు రాహు,శని జపాలు చేసుకోవాలి.
మరో ధైర్యంతో ముందుకు సాగాలి.

Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News