Ugadi Festival 2024: ఉగాది పండగను దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసా..

Ugadi Festival 2024: ఉగాది తెలుగు వారికీ  ముఖ్యంగా హిందువులకు మొదటి పండగ ఉగాదితోనే ప్రారంభం అవుతోంది. యుగానికి ఆది తొలి రోజు అనే అర్ధంలో ఉగాది పేరు వచ్చింది.  ఉగాది తెలుగు సంవత్సారాది. నూతన సంవత్సరానికి కొత్త భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతూ జరుపుకునే పండుగ. దీన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఏయే ప్రాంతాల్లో ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసుకుందాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2024, 09:29 AM IST
Ugadi Festival 2024: ఉగాది పండగను దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసా..

Ugadi Festival 2024 Celebrations: ఉగాది.. షడ్రుచుల సమ్మేళనం.    జీవితపు పరమార్థాలు. సుఖదు:ఖాలు, సంతోషవిషాదాలు, కోపతాపాలు.. ఇవన్నీ మన జీవితాన్ని నిర్థేశిస్తాయి. వీటిల్లో ఏది ఎక్కువా, తక్కువా అయినా జీవితం అర్థం లేకుండా గడుస్తుంది. అలా కాకుండా జీవితంలో అన్నింటిని సమభాగం చూపించేదే ఉగాది పచ్చడి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం, ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.ఉగాది తెలుగు సంవత్సారాది. కొత్త సంవత్సరానికి కొత్త భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతూ జరుపుకునే నిత్య నూతన పండుగ. దీన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, బెంగాల్ లలో వేరు వేరు పేర్లతో ఉగాది జరుపుకుంటారు. పేరేదైనా కావొచ్చు కానీ.. అన్నింటిలోనూ కనిపించేది బంగారు భవిష్యత్తే.

మరాఠీల ఉగాదిని గుడిపడ్వాగా జరుపుకుంటారు.  తెలుగు వారిలాగే మరాఠీలు కూడా చాంద్రమానాన్నే అనుసరిస్తారు. అందుకే గుడిపడ్వా పండుగ కూడా చైత్రశుద్ద పాడ్యమినాడే వస్తుంది. పడ్వా అంటే పాడ్యమి అని అర్థం. ఈ పండుగ రోజు వీరు మన ఉగాది పచ్చడి లాంటిదే తయారు చేస్తారు. బ్రహ్మా దేవుడు సృష్టి ఆరంభించిన రోజు కాబట్టి దానికి గుర్తుగా బ్రహ్మధ్వజం నిలుపుతారు. వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పి, పూలతో ఆలకరించిన పైన వెండి లేదా కంచుపాత్రలు బోర్లిస్తారు. గుడిపడ్వా రోజు ఈ బ్రహ్మధ్వజాలను తప్పని సరిగా ప్రతిష్టిస్తారు.  సింధీలు తమ క్యాలెండర్ యేడాది ప్రారంభమైన చేతి చంద్‌ను ఉగాదిగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. మణిపురిలు కూడా తమ కొత్త యేడాదిని అదే రోజున 'సాజిబు నోంగ్మా పన్బామా'గా జరుపుకుంటారు.

మన దేశంలోనే కాదు.. బాలి దేశంలోని హిందువులు కూడా కొత్త యేడాదిని 'నైపి' రోజునే జరుపుకుంటారు. మారిషస్‌లోని ఐదు హిందూ జాతీయ ప్రభుత్వ సెలవు దినాల్లో ఉగాది పర్వదినం ఒకటి.

ఇక బెంగాలీల కొత్త సంవత్సరం వైశాఖమాసంతో మొదలవుతుంది. బెంగాలీ కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. అందుకే వైశాఖ శుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. దీన్ని పోయ్ లా బైశాఖ్ అంటారు. సిక్కులు సౌరమానాన్ని పాటిస్తారు. కాబట్టి దీని ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. ఇది ప్రతిఏటా ఎప్రిల్ 13న వస్తుంది. తమిళనాడులో కొత్త సంవత్సరం వేడుకలను పుత్తాండుగా పిలుస్తారు. ఒకప్పుడు తమిళనాడులోనూ, తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగానే ఒకే సమయంలో జరిగేవి. ప్రస్తుతం ఉగాది పండగను చిత్తిరై తిరునాళ్ గా జరుపుకుంటున్నారు. మళయాళంలో విషు అంటారు.  వీరు కూడా సౌరమానాన్నే అనుసరిస్తారు. అందుకే వీరి ఉగాది కూడా ఎప్రిల్ నెలలోనే వస్తుంది.  రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండుగ ఉగాది. ఉదయం అభ్యంగనస్నానంతో మొదలైన ఈ పండుగ సాయంత్రం పంచాంగశ్రవణంతో ముగుస్తుంది. ఉగాదినాడు పంచాంగశ్రవణం తప్పని సరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం మొత్తం ఎలా జరగబోతుందో తెలుస్తుంది. ఈ పండుగకు ఇదే పెద్ద హైలేట్. మరే పండుగకీ లేని పంచాంగశ్రవణ స్పెషలిటీ ఉగాది సొంతం.

కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకోవడానికి అవసరమైన గ్రహశాంతులు జరిపించుకుని సుఖంగా ఉండటానికి పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే అయిదు అంగములు అని అర్థం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలు. వీటన్నింటీనీ తెలిపేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరుణ ఫలితాన్ని తెలుసుకుంటే గంగాస్నానం చేసినంత పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ నే ఫాలో అవుతున్నారు. కానీ శుభకార్యాలు, పూజాలకు, పితృదేవతారాధన వంటి వాటికి తప్పనిసరిగా పంచాంగాన్ని వాడుతున్నారు. పూర్వం  పంచాంగం తాటాకుల మీద రాయబడేది కాబట్టి అందరికి అందుబాటులో ఉండేకపోయేది. అందుకే ఉగాది రోజు ఊరుమొత్తం గుడిముందో.. లేక ఏదైనా ప్రదేశంలోనో ఒక చోట చేరి పంచాంగ శ్రవణం చేసేవారు. కానీ ఇప్పుడు పంచాంగం అందిరికి అందుబాటులోకి వచ్చేసింది. దీంతో పంచాంగ శ్రవణాల ప్రాముఖ్యతా తగ్గిపోయింది. ఊరు మొత్తం కలిసి చేసుకునే ఈ పండుగ ఇప్పుడు గుళ్లకు మాత్రమే పరిమితమయింది.

Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News