Today Rasi Phalalu, 30 January 2024: ఈరోజు వ్యాపారస్తులకు ఆర్థికసంక్షోభం తప్పదు.. అవసరమైతే వీళ్లు డాక్టర్ సలహా తీసుకోవాలి..

Today Rasi Phalalu 30 January 2024: జనవరి 30న ఏ రాశివారికి ఎలా ఉంటుందో.. ఏ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 30, 2024, 10:45 AM IST
Today Rasi Phalalu, 30 January 2024: ఈరోజు వ్యాపారస్తులకు ఆర్థికసంక్షోభం తప్పదు.. అవసరమైతే వీళ్లు డాక్టర్ సలహా తీసుకోవాలి..

Today Rasi Phalalu 30 January 2024: 2024 జనవరి 30న ఏ రాశివారికి ఎలా ఉంటుందో.. ఏ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

మేషరాశి..

మేషరాశివారు ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అవసరమైతే డాక్టర్ సలహా కూడా తీసుకోండి. ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు సానుకూల ఆలోచనతో పని చేస్తూ ఉండాలి. వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు ఆర్థికసంక్షోభం ఉంటే ఇబ్బంది పడకుండా ఓపిక పట్టాలి. 

వృషభం..

వృషభ రాశివారు మీ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. మీరు పనిచేసే చోట సహోద్యోగులతో ఎవరితోనూ వివాదాలకు దిగకుండా ఉండండి. వృషభరాశి. వ్యాపారులకు ఈరోజు సవాలుగా ఉంటుంది. 

మిథునరాశి..

మిథునరాశివారికి ఈరోజు ఆరోగ్యం క్షీణించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేయవచ్చు. వ్యాపారంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా, అవసరమైతే, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

కర్కాటక రాశి..

కర్కాటరరాశివారు ఈరోజు చల్లని ఆహారాన్ని తినడం మానుకోవాలి. లేదా ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. పని భారం కారణంగా ఈరోజు కార్యాలయంలో మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. వ్యాపారస్తులు ఈరోజు భారీ లాభాలు పొందవచ్చు.

సింహరాశి..

సింహరాశివారు ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ ఆరోగ్యం మామూలుగా ఉండవచ్చు.కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్త వింటారు. విద్యార్థులకు మంచి సమయం.

కన్య ..

కన్యరాశివారు ఈ రోజు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధవహించాలి. ఏ పనైనా జాగ్రత్తగా చేయాలి. ఆఫీసులో ఈరోజు మీకు సాధారణమైన రోజు కావచ్చు. సాంకేతిక సమస్యల కారణంగా మీరు వ్యాపారంలో నష్టపోవచ్చు. 

తులారాశి ..

ఈ రాశివారు ఈరోజు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్త అందుతుంది. ఈరోజు మీ మనసు సంతోషంగా ఉండవచ్చు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. 

వృశ్చికరాశి..

వృశ్చికరాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో నోరు జారకూడదు. అనసవర చర్చలకు దిగకండి. లేకుంటే మీకు పెద్ద నష్టం వాటిల్లుతుంది. ఈరాశికి చెందిన వ్యాపారులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. 

ధనుస్సు..

ధనస్సురాశికి చెందిన వ్యాపారులు ఈరోజు నష్టం వాటిల్లుతుంది. మీ ఆరోగ్యం పట్ల ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకండి. పని చేసే వ్యక్తులు ఈ రోజు మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో కొంత సమస్యను ఎదుర్కోవచ్చు.  

మకరరాశి..

వ్యాపారులు ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీరు ఆఫీసులో మీ సహోద్యోగులకు సహాయం చేయవలసి రావచ్చు. 

కుంభ రాశి..

కుంభరాశివారికి ఈరోజు అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. పని చేసే వ్యక్తులకు ఈరోజు ఆఫీసులో మంచి రోజులు ఉండవచ్చు. వ్యాపారులకు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. 

మీనరాశి..

మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవాలి.పని చేసే వారికి ఈ రోజు మంచి రోజు ఉంటుంది.విద్యార్థులకు కూడా శుభసమయం.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)

ఇదీ చదవండి: జీడిపప్పును ఈ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే.. మీకోరికలు త్వరగా నెరవేరి దరిద్రం తొలగిపోతుందట..!

ఇదీ చదవండి: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News