Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారా

Tirumala Laddu Dispute in Telugu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వివాదం రచ్చకెక్కుతోంది. గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్నించి తిరుమల లడ్డూ అత్యంత వివాదాస్పద వ్యవహారంగా మారింది. అసలేంటీ వివాదం..పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2024, 12:40 PM IST
Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారా

Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ అనగానే హిందూవులకు ఓ పవిత్రమైన భావన. తిరుమల దర్శించుకున్నామంటే చాలు లడ్డూ ఏదని అడుగుతుంటారు. హిందూవుల పవిత్ర క్షేత్రమైన తిరుమలలో లడ్డూ ప్రసాదంగా ఇస్తుంటారు. ఈ లడ్డూకు చాలా డిమాండ్ ఉంది. ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వం ఆరోపణలు సంధించుకుంటున్నాయి. 

తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం  ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు చేర్చింది. ఇదే ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం..మీరు సిద్ధమా అని చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి సవాలు సైతం విసిరారు. అటు కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. విష ప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారని మండిపడ్డారు. 

తిరుమల లడ్డూ తయారీకు రోజుకు 300-500 లీటర్ల నెయ్యి అవసరమౌతుంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తారు. ప్రతి 6 నెలలోకోసారి ఇ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా కావల్సిన నెయ్యిని సమకూర్చుకుంటుంది టీటీడీ. 2021 మార్చ్ వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. ఆ సమయంలో జరిగిన టెండర్లలో ఎల్ 1గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీమియర్ ఎల్ 1 గా నిలిచింది. ఎల్ 2గా ఆల్ఫా కంపెనీ నిలిచింది. కిలో నెయ్యి 424 రూపాయలకు సరఫరా చేసేందుకు ఒప్పందమైంది. ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్పుకుంది. 

అప్పట్నించి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. ఎల్ 2గా నిలిచిన ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బటర్ ఆయిల్‌తో లడ్డూ తయారు చేసుకుందని కూటమి నేతలు ఆరోపణలు మొదలెట్టారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి తలెత్తిందని మాజీ టీటీడీ సభ్యుడు వెంకట రమణ సైతం ఆరోపించారు. నిబంధనలు పక్కనబెట్టి మాజీ ఈవో ధర్మారెడ్డి కమీషన్ల కోసం ఇలా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణల్ని ఖండించారు. విష ప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ఠ అన్నారు. పవిత్రమైన లడ్డూని శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా చేస్తారని, తిరుమల లడ్డూ తయారీలో ప్రత్యేక దిట్టం ఉందని ఎవరి జోక్యం ఉండదని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే 2019-24 లో కూడా నెయ్యి సరఫరా చేశాయని స్పష్టం చేశారు. 

Also read: Saturn Transit: శనిగ్రహం నక్షత్రం మారుతోంది ఈ 6 రాశులకు డిసెంబర్ 27 వరకు ఏం జరగబోతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News