PF Withdrawal Rules: మోదీ 100 రోజుల పాలన.. ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఏకంగా రూ.లక్ష వరకు..!

PF Account Withdrawal Limit Increased: ఈఫీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒకేసారి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పటివరకు కేవలం రూ.50 వేల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రూ.లక్షకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న వినియోగాలకు అనుగుణంగా లిమిట్ పెంచినట్లు చెప్పారు. దీంతో పీఎఫ్‌ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

1 /7

పెళ్లి, వైద్యం ఇతర ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్‌ ఖాతాదారులు ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి తరుచుగా డబ్బులు విత్ డ్రా చేసుకుంటూ ఉంటారని.. అందుకే రూ.లక్ష వరకు విత్‌డ్రాయల్ వరకు పెంచామని మంత్రి మాన్సుఖ్ మాండవియా చెప్పారు.  

2 /7

అంతేకాకుండా మరిన్ని మార్పులకు శ్రీకారం చూడుతున్నట్లు ఆయన తెలిపారు. న్యూ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్, పీఎఫ్ అకౌంట్ నిర్వహణను సులభతరం చేయడం, కంప్లైంట్స్‌పై త్వరగా స్పందించేందుకు మార్గదర్శకాలు వంటివి ఉన్నాయన్నారు.  

3 /7

అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఆరు నెలల గడవకు ముందే విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆరు నెలలు దాటిన తరువాతనే ఉపసంహరించుకునే అవకాశం ఉండేది. ఈ నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు.  

4 /7

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో భాగం కాని సంస్థలను స్టేట్ రన్ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్‌గా మార్చేందుకు కేంద్రం అనుమతించింది. మొత్తం 1,00,000 మంది ఉద్యోగులతో రూ.1000 కోట్ల కార్పస్‌తో ఇలాంటి 17 కంపెనీలు ఉన్నాయి. ఈ ఉద్యోగులు వారు తమ సొంత ఫండ్‌కు బదులుగా ఈపీఎఫ్‌కు మారాలనుకుంటే మారిపోవచ్చు.    

5 /7

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో భాగం కాని సంస్థలను స్టేట్ రన్ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్‌గా మార్చేందుకు కేంద్రం అనుమతించింది. మొత్తం 1,00,000 మంది ఉద్యోగులతో రూ.1000 కోట్ల కార్పస్‌తో ఇలాంటి 17 కంపెనీలు ఉన్నాయి. ఈ ఉద్యోగులు వారు తమ సొంత ఫండ్‌కు బదులుగా ఈపీఎఫ్‌కు మారాలనుకుంటే మారిపోవచ్చు.    

6 /7

కోటి మంది ఉద్యోగులకుపైగా పీఎఫ్‌ రిటైర్‌మెంట్ ఆదాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎఫ్‌ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.   

7 /7

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ప్రకారం.. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ప్రావిడెంట్ ఫండ్‌కు కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఉద్యోగి జీతంలో 12 శాతం, యజమాని 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది.