cv anand serious on Hyderabad ganesh delaying shobhayatra: దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అదే విధంగా నిమజ్జన కార్యక్రమం కూడా అంతే వేడుకగా జరిగింది. మరోవైపు హైదరాబాద్ లో వినాయక నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇప్పటికి కూడా అనేక చోట్ల ఇంకా నిమజ్జనాల కోసం క్యూలు కట్టారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో భారీ గణనాథులు ఇంకా దర్శనమిస్తున్నాయి.
#WATCH | Telangana | Hyderabad Commissioner of Police, CV Anand says, "...Since yesterday morning, the final immersion ceremony has been taking place. Compared to last year with all the efforts put in we have been able to save about 3 hours. The entire program has been completed… pic.twitter.com/jklJeRikFX
— ANI (@ANI) September 18, 2024
నిజానికి.. బుధవారం రోజు రాత్రి వరకు నిమజ్జనం జరిగిపోవాలి. కానీ చాలా చోట్ల గణేష్ మండపాల నిర్వాహాకులు ఆలస్యంగా శోభాయాత్రలను ప్రారంభించడం వల్ల నిమజ్జనం ఆలస్యమైందని తెలుస్తోంది. ఈక్రమంలో ఇటీవల హైదరాబాద్ కు రెండోసారి సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ మండపాల నిర్వాహాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికి కూడా అనేక చోట్ల గణేష్ మండపాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన నిమజ్జనాలు.. ఇప్పటికి కూడా మెల్లగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో గణపయ్యలు ఇంకా రోడ్డుపైన కన్పిస్తున్నాయి. దీంతో పోలీసులు, ఇతర శాఖల అధికారులు గణపయ్య విగ్రహాల నిమజ్జనంతొందరగా చేసేలా మండపాల నిర్వహాకులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలో.. హైదరబాద్ సీపీ ఆనంద్ మండపాల కమిటీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు వచ్చే ఏడాది నుంచి సమయానికి గణేష్ నిమజ్జనం అయ్యేలా చూసుకొవాలన్నారు. ప్రభుత్వం వినాయక నిమజ్జనం కోసం ఒక రోజు సమయం ఇస్తున్న.. కూడా ఆలస్యంగా విగ్రహాలను నిమజ్జనంకోసం తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది నిర్వాహాకుల వల్ల.. సామాన్య ప్రజలకు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలా ఆలస్యం చేయడం మానుకొవాలని.. 11 వ రోజునే నిమజ్జనం అయ్యేలా చర్చలు తీసుకొవాలన్నారు.
మరోవైపు... హుస్సేన్ సాగర్ లో... లక్ష గణేష విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సీపీ తెలిపారు. ఇప్పటికి కూడా అనేక గణపయ్యలు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాయని, ఈరోజు సాయత్రం వరకు నిమజ్జనం అవుతాయని చెప్పారు. గత ఏడాది తో పోలిస్తే మూడు గంటల ముందే నిమర్జన ప్రక్రియ పూర్తయిందని సీపీ ఆనంద్ వెల్లడించారు.
ఉదయం పూట.. 10:30 కి అన్ని ట్రాఫిక్ జంక్షన్ లు క్లియర్ అయ్యాయని,ఒక ప్రణాళిక ప్రకారం నిమర్జనం పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బడా గణేష్ నిమర్జనం అనుకున్న సమయానికి పూర్తి అయ్యిందన్నారు. ఈ నిమర్జన ప్రక్రియ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అదే విధంగా.. రాత్రి 10:30 కి ఓల్డ్ సిటీ లో వినాయక విగ్రహాల నిమర్జనం పూర్తి అయ్యాయని అన్నారు. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వాళ్ళ నిమర్జనం కొంత ఆలస్యం అయిందని తెలిపారు. నిమర్జనికి సహకరించిన ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్న.. అంటూ సీపీ ఆనంద్ తన స్పెషల్ ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.