Business Ideas for Food: వ్యాపారం చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకున్నారా..ఉద్యోగం కోసం ఎదురుచూసి సమయం వృధా చేసుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీ కోసం. ఈ బిజినెస్ ద్వారా మీరు సీజన్లో చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాదు దీని ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుంది.అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫుడ్ బిజినెస్ లో అవకాశాలకు కొదువ లేదు.. జనాభా పెరిగే కొద్దీ ఫుడ్ బిజినెస్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. రకరకాల ఫుడ్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎప్పటికీ డిమాండ్ అనేది తగ్గదు అన్న విషయం గుర్తించాలి. తాజాగా క్యాటరింగ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు ఈవెంట్స్ అనేవి తప్పనిసరి ఇక పెళ్లిళ్ల సీజన్లో అయితే ప్రతిరోజు పని లభిస్తుంది పెళ్లిళ్లు మాత్రమే కాదు ఫంక్షన్లు, ఈవెంట్స్ ఇలా ప్రతి సందర్భానికి క్యాటరింగ్ అనేది తప్పనిసరి. ఈ నేపథ్యంలో మీరు క్యాటరింగ్ వ్యాపారం ద్వారా ఆదాయం పొందాలి అనుకున్నట్లయితే చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
క్యాటరింగ్ బిజినెస్ లో రాణించాలంటే అనుభవం తప్పనిసరి. అయితే ఒక్కోసారి ఈ అనుభవం అనేది చాలామందికి ఉండదు. ఈ నేపథ్యంలో మీరు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థలో డిప్లమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ సర్టిఫికెట్ కోర్సు చేయడం ద్వారా ఈ రంగం పట్ల అవగాహన లభిస్తుంది. ఈ కోర్స్ ఫీజు 5000 రూపాయలు. కేవలం 6 నెలల వ్యవధిలోనే మీరు ఈ రంగంలో నైపుణ్యాలు మెలకువలు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేయాలంటే కనీసం విద్యార్హత పదో తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుంది.
క్యాటరింగ్ బిజినెస్ లో రాణించాలంటే ముందుగా చక్కటి ప్లానింగ్ అనేది అవసరం. ఇందుకోసం మీరు తక్కువ పెట్టుబడితో ముందు చిన్న చిన్న ఫంక్షన్లు చేయడం ప్రారంభించాలి.ఇందుకోసం కనీస పెట్టుబడి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టవచ్చు. ఇందులో వంట సామాన్లు ముఖ్యమైనవి ఆర్డర్లు పెరిగే కొద్దీ మీ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోవచ్చు. వివాహ శుభకార్యాలకు పెద్ద మొత్తంలో కేటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు పెట్టుబడి పెంచుకోవాలి. కనీసం ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు పెద్ద మొత్తంలో క్యాటరింగ్ ఆర్డర్లను పొందవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడిలో వంట సామాన్లతో పాటు సిబ్బంది జీతభత్యాలు వాహనం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
క్యాటరింగ్ లో పెట్టుబడి కన్నా ముఖ్యమైనది క్వాలిటీ, అదే విధంగా అందుబాటు ధరల్లో ఉండటం ప్రాథమిక బిజినెస్ సూత్రంగా చెప్పవచ్చు. కస్టమర్ సంతృప్తి పొందడమే, ఈ బిజినెస్ లో విజయ సూత్రంగా చెప్పవచ్చు. అంతేకాదు క్యాటరింగ్ బిజినెస్ లో అత్యంత ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్. లేకపోతే ఈ బిజినెస్ లో రాణించడం అంత సులువు కాదు. ఎప్పటికప్పుడు ఆర్డర్లను పొంది సమయాన్ని వృధా చేసుకోకుండా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ బిజినెస్ ద్వారా ప్రతినెల లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.
Also Read : Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.