Balineni Srinivasa reddy: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. జనసేన లోకి జంప్..?

balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 18, 2024, 06:53 PM IST
  • వైసీపీకి బిగ్ షాక్..
  • పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన బాలినేని..
Balineni Srinivasa reddy: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. జనసేన లోకి జంప్..?

balineni Srinivasa reddy resigns ysrcp party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి.. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. అంతేకాకుండా.. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యమన్నారు. ఆయన రాజీనామాలేఖలో సంచలన విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతకొంత కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాల పట్ల.. బాలినేని.. కాస్తంతా నిరుత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి నుంచి తప్పించినప్పటి నుంచి బాలినేని తీవ్రమనోవేదనకు గురయ్యారని ప్రచారం కూడా జరిగింది.

ఐదుసార్లు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు మార్లు మంత్రిగా చేసిన వ్యక్తి పట్ల .. జగన్ తీరు సరిగ్గాలేదని అన్నారు.రాజకీయాల్లో  భాష, విలువలను పాటించాలన్నారు. ప్రస్తుతం వైసీపీలో అది కొరవడిందని అన్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వంవేరని అన్నారు. ఇక్కడ ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. 

 పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు తెలిపారు. గతంలో బాలినేని పార్టీ వీడతానంటూ.. వైఎస్ జగన్ అప్పట్లో పలుమార్లు బుజ్జగింపుల కార్యక్రమం చేశారని కూడా తెలుస్తోంది. కానీఆయన ఎప్పటికైన పార్టీ నుంచి జంప్ అవ్వడం ఖాయమని కూడాప్రచారం జరిగింది. అందరు అనుకున్నట్లుగానే బాలినేని... ఈరోజు పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

మరోవైపు ఆయన జనసేనలో చేరుతున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవర్ కళ్యాణ్ తో.. బాలినేని వర్గం టచ్ లోకి వెళ్లినట్లు కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు జనసేన పార్టీఅధినేతను కలిసి.. పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది.  ఇదిలా ఉండగా.. ఈ ఘటన మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఏపీలో జగన్ కు వరుస షాక్ లు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు సొంత పార్టీ నేతలు పార్టీలు విడిపోతున్నారు. ఉన్నవారు.. ఎప్పుడు ఏంచేస్తారో అని కూడా జగన్ కు నిద్రపట్టడంలేదంట.

మరోవైపు జగన్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా.. అడ్డగొలుగా చేసిన అక్రమాలను.. చంద్రబాబు సర్కారు బైటకు తీస్తుంది. ఇక .. సొంత చెల్లీ వైఎస్ షర్మిలా గ్యాప్ దొరికితే.. అన్నను తన పదునైన మాటలతో, విమర్శలతో ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. ఇప్పటికే ముంబైకి చెందిన నటి జెత్వానీ కేసు విచారణ వేగంను పోలీసులు పెంచారు.

Read more: Viral video: కాళీకా అమ్మవారే దిగోచ్చిందా..?.. కోల్‌కతా హత్యాచార ఘటనపై హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్.. వీడియో వైరల్..

ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.తాజాగా, జగన్ బాబాయ్..వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో.. ఆయన కూతురు సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలిసి దర్యాప్తు స్పీడ్ ను పెంచేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఏపీ రాజధాని గురించి నోటికొచ్చినట్లు వైసీపీ వాళ్లు మాట్లాడితే.. చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News