Surya Gochar December 2022: జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న విధంగా ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో రాశి మారుతూ ఉంటుంది. గ్రహాలు సంచారం తిరోగమనం చేయడం వల్ల 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే సూర్య గ్రహం తన రాశి చక్రాన్ని వదిలి ఇతర రాశిలోకి డిసెంబర్ 16న సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాడని సమాచారం. ఈ సంచారం వల్ల పలు రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల వారు కొన్ని రకాల శుభకార్యాలు నిర్వహించకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహ సంచార ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గ్రహ సంచారం ఎఫెక్ట్ ఈ రాశుల వారిపై..
ధనుస్సు రాశి:
డిసెంబర్ 16న జరిగే సూర్య గ్రహ సంచారం వల్ల ధనస్సు రాశి వారిపై చెడు ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబంలో సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది లేకపోతే తీవ్ర సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది.
మకరరాశి:
ఈ గ్రహ సంచారం వల్ల ధనస్సు రాశి వారికే కాకుండా మకర రాశి వారు కూడా తీవ్ర దుష్ప్రభావాలు కలుగుచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మకర రాశి వారికి ఆర్థికంగా నష్టాలు వచ్చి కష్టాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డ్రైవింగ్ చేసే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే చాన్స్ ఉంది కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
కర్కాటక రాశి:
ఈ సూర్య గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కూడా హాని కలగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు పెరిగి తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగి వారి మధ్య బంధాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభం:
సూర్య గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారికి కూడా కొన్ని రకాల నష్టాలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచారం వృషభ రాశి వారికి శుభప్రదమైనది కాదని.. ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తల్లిదండ్రుల పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Also Read: Rohit Sharma: రోహిత్ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో
Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి