Sun Transit 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ప్రతి రాశిలో సూర్యుడు ఒక్కొక్క నెల ఉంటాడని నమ్ముతారు. జనవరి 15వ తేదీన సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఏర్పడే మకర సంక్రాంతి నాలుగు రాశులవారి జీవితాల్లో ఆనందాలు నింపనుంది. ఏయే రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం. ఆదే రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. నెలరోజులపాటు ఇదే రాశిలో సూర్యుడు ఉండటం వల్ల అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. సూర్యుడి గోచారం కారణంగా ఈ నాలుగు రాశులకు మహర్జాతకం పట్టనుందని చెప్పవచ్చు. అంటే మరో మూడ్రోజుల్లో జాతకం మారిపోనుంది.
సూర్యుడి మకర రాశి ప్రవేశం ప్రభావం సింహ రాశిపై అధికంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు జనవరి 15 నుంచి నెలరోజులు పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అమితమైన లాభాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఎదురౌతాయి. ఆర్ధికపరమైన, ఇతర సమస్యలు తీరిపోతాయి. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సూర్య గోచారం ప్రభావం వృశ్చిక రాశి జాతకులపై కనకవర్షం కురిపించనుంది. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. కెరీర్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
మేష రాశి జాతకులకు చాలా బాగుంటుంది. కెరీర్‌పరంగా ఎదుగుదల ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణం అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగాలు లబించవచ్చు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్దిస్తారు. ఆర్దికంగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వృషభ రాశి జాతకులకు అంతా ఆనుకూలమైన సమయం. ఈ రాశివారికి కుటుంబ జీవితం అద్బుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు అనుకూలంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి నెలరోజుల పాటు తిరుగుండదు.
Also read: Venus Transit 2024: ఫిబ్రవరి 12 నుంచి ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, ఊహించని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sun Transit 2024: ఆ 4 రాశులకు మరో మూడ్రోజుల్లో మారనున్న జాతకం, ఊహించని ధనలాభం