Sun-Saturn transit 2023: మరో మూడ్రోజుల్లో ఈ మూడు రాశులకు మహర్దశ, పట్టిందల్లా బంగారమేనట

Sun-Saturn transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో గ్రహాలు ఏర్పరిచే యుతి ప్రభావానికి మరింత మహత్యముంటుంది. అదే కోవలో ఏర్పడనున్న సంసప్తక్ రాజయోగం గురించి తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2023, 07:44 AM IST
Sun-Saturn transit 2023: మరో మూడ్రోజుల్లో ఈ మూడు రాశులకు మహర్దశ, పట్టిందల్లా బంగారమేనట

Sun-Saturn transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు సక్రమ లేదా వక్రమార్గంలో పయనించడం వల్ల ఆ ప్రభావం ప్రతి ఒక్కరిపై కచ్చితంగా పడుతుందంటారు. మరో మూడ్రోజుల్లో సూర్యుడి సింహరాశిలో ప్రవేశించనుండటంతో కొన్ని కీలకమైన పరిణామాలు జరగనున్నాయి. ఫలితంగా  సంసప్తక్ రాజయోగం ఏర్పడనుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..

మరో మూడ్రోజుల్లో అంటే ఆగస్టు 17 వతేదీన సూర్యుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. ఆ తరువాత శని, సూర్య గ్రహాలు ఎదురెదురుపడతాయి. ఫలితంగా సంసప్తక్ రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. కానీ మూడు రాశులపై విశేషంగా ఉంటుంది. సూర్య, శని గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగంతో వృషభం, సింహం, వృశ్చిక రాశుల జాతకులకు అద్భుతమైన ప్రయోజనం కలగనుంది. అంతులేని ధన సంపదలు ఆకశ్మికంగా వచ్చి పడతాయి. అంటే కేవలం మరో మూడ్రోజుల్లో ఈ మూడు రాశుల జాతకం మహర్దశ పట్టనుంది. వద్దంటే డబ్బులు వచ్చి పడనున్నాయి. 

సూర్య, శని గ్రహాల కలయికతో సింహ రాశి జాతకులపై సంసప్తక్ రాజయోగం సిరులు కురిపించనుంది. ఈ గోచారం కుండలిలో బుధాదిత్య రాజయోగం నిర్మాణం కానుంది. ఫలితంగా ఊహించని విధంగా డబ్బులు వచ్చిపడతాయి. అంతేకాకుండా ఇతర భౌతిక సుఖాలు కూడా ప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు మంచి సమయంగా భావిస్తారు. ఆస్థులు లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మొత్తానికి ఈ రాశి జాతకులు అందరికీ అన్ని విధాల ప్రయోజనం కలగనుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు సాఫల్యం లభిస్తుందంటారు. కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటాయి.

వృశ్చిక రాశి జాతకుల అదృష్టం తిరగరాయనుంది ఈ సంసప్తక్ రాజయోగం. ఫలితంగా గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాల్ని ఆర్జించిపెడతాయి. అదే సమయంలో బుధాదిత్య రాజయోగం కారణంగా వ్యాపారంలో భారీ లాభాలు కలగనున్నాయి. 

ఇక సంసప్తక్ రాజయోగం ప్రభావం వృషభ రాశులపై అద్భుతంగా ఉండనుంది. వృషభ రాశికి అదిపతి శుక్రుడు కుండలిలో మూడవ ఇంట్లో వక్రమార్గంలో ఉన్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఫలితంగా ఈ రాశివారికి ఊహించని మార్గాల్నించి అంతులేని డబ్బులు వచ్చిపడనున్నాయి. ఒకరని కాదు అన్ని రంగాల్లో వారికి లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారం చేసేవారికి , ఎగుమతులు-దిగుమతులుంటే లాభాలు అంతులేనివిగా ఉంటాయి.వృషభ రాశి జాతకుల గోచారం కుండలిలో సూర్య, శని గ్రహాల వల్ల ఏర్పడే రాజయోగం అద్భుత ఫలితాలు ఇవ్వనుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి ఇలా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలగనుంది. 

Also read: Rahu transit 2023: మీనరాశిలోకి ప్రవేశించబోతున్న రాహువు.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News