Surya Guru yuti in Mesh Rashi 2024: గ్రహాల రాజు అయిన సూర్యుడు, దేవగురు బృహస్పతి త్వరలో మేషరాశిలో కలవబోతున్నారు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. ప్రస్తుతం సూర్యభగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 13న భాస్కరుడు మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి కలయిక 12 ఏళ్ల తర్వాత సంభవించబోతుంది. ఇది మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ను అందివ్వబోతుంది.
కర్కాటక రాశి
మేషరాశిలో సూర్యుడు మరియు గురుడు సంయోగం కర్కాటక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. దాంపత్య జీవితంలోని టెన్షన్స్ తొలగిపోతాయి, అంతేకాకుండా మీరు లైఫ్ పార్టనర్ తో ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది.
మిధునరాశి
మిథునరాశి వారికి సూర్యుడు-బృహస్పతి కలయిక ఎనలేని ప్రయోజనాలను అందివ్వబోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. మీరు ఫారిన్ కు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలు భారీగా పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఆర్థిక పరిస్థితి పటిష్టమవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బంధాలు బలపడతాయి.
ధనుస్సు రాశి
గ్రహాలరాజు-దేవగురు మైత్రి ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ సంపద భారీగా పెరుగుతుంది. మీ పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పెళ్లికాని ప్రసాద్ లకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవ్వడంతోపాటు అది పెళ్లికి దారి తీస్తుంది. మీరు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Chandra Grahan 2024: హోలీ రోజే చంద్రగ్రహణం.. ధనవంతులు కాబోయే రాశులు వారు వీళ్లే..
Also read: Shani Dev: హోలీ తర్వాత నక్షత్రాన్ని మార్చనున్న శని... ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి