Sravana Masam Rasi Phalalu 2024: శ్రావణ మాసంలో ఈ రాశులవారికి తిరుగులేదు.. డబ్బే, డబ్బు!

Sravana Masam Lucky Zodiac Sings 2024: శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల ఐదు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 5, 2024, 09:40 AM IST
Sravana Masam Rasi Phalalu 2024: శ్రావణ మాసంలో ఈ రాశులవారికి తిరుగులేదు.. డబ్బే, డబ్బు!

Sravana Masam Lucky Zodiac Sings 2024: తెలుగు క్యాలెండర్‌ ప్రకారం, ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసానికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు శ్రావణ మాసంలోని సోమవారం కావడంతో ఎంతో శుభప్రదంగా భావిస్తారు. హిందు పురాణాల ప్రకారం ఈ మాసంలో మహాశివుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా శ్రావణ మానసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు ఈ నెలలోనే రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ శ్రావణ మాసంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

కర్కాటక రాశి:
శ్రావణ మాసంలోని కర్కాటక రాశివారికి చాలా బాగుంటుంది. దీంతో పాటు వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఇతరుల సూచనలు తీసువాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు.

సింహ రాశి:
ఈ మాసంలో సింహ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారికి భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో పిల్లల నుంచి కూడా గుడ్‌ న్యూస్‌ వింటారు. అంతేకాకుండా వీరికి శివుడి అనుగ్రహం లభించి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. 

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా శ్రావణ మాసంలో శివుడి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారికి ఏకాగ్రత పెరిగి అనుకున్న పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 

ధనుస్సు రాశి:
ఈ సమయం ధనుస్సు రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో వీరికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలాగే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్ లభించి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మీన రాశి: 
ఈ శ్రావణ మాసంలో మీన రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు జీవితం కూడా ఎంతో ఆనందంగా మారుతుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News