Shani bhagwan sadesati shani dosh nivaran: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో శనిదేవుడి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏలినాటి, సాడేసాతి, అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. అయితే.. శనిదేవుడు కర్మ ప్రభువు. మనం చేసుకున్న కర్మల ఆధారంగా ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. అందుకే ఎల్లప్పుడు మంచి పనులు, సన్మార్గంలో ఉండాలని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా శనివారం రోజున శనిదేవుడికి కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో శనిదోష సమస్యలు ఉండవంట. శనివారం రోజున శుభ్రంగా స్నానం చేసి.. ఉతికిన వస్త్రాలు ధరించి శని ఆలయంకు వెళ్లాలి. ఆ తర్వాత శనీ దేవుడికి ప్రీతీ కోరకు తైలాభిషేకం చేయాలి. అదే విధంగా నల్లని చిన్న వస్త్రంను శనిదేవుడికి అర్పించాలి. నల్ల నువ్వులు, నల్లని పండ్లు స్వామివారికి నైవేద్యంగా చూపించాలి.
అదే విధంగా.. కాకులు, నల్ల కుక్కలు, నల్ల చీమలకు చపాతీలు, చక్కెర, బెల్లం వంటివి తినేందుకు పెట్టాలి. శనిదేవుడి ఆశీర్వాదం కోరకు.. సూర్యారాధన చేయాలి. నిరంతరం శనిదేవుడి స్తోత్రాలు, శని అష్టోత్తర నామాలు చదువుకుంటు ఉండాలి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే క్రమంగా శనిదోషం నుంచి బైటపడొచ్చు.
చాలా మంది శని భగవానుడ్ని చూసి అదేదో చెడు ఫలితాలు కల్గుతాయని భావిస్తారు. కానీ ఆయన అనుగ్రహాం కల్గితే.. కటిక పేదరికంలో ఉన్నవ్యక్తి సైతం.. అపర కుబేరుడువ్వడం ఖాయమని పండితులు చెబుతున్నారు. అందుకు ఈ పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter