Budh Gochar 2022: ధనస్సు రాశిలోకి తిరోగమన బుధుడు... ఈరాశులకు కష్టాలే కష్టాలు..

Budh Gochar 2022: ధనుస్సు రాశిలో తిరోగమన బుధుడు సంచరించడం వల్ల అనేక రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి. ఆ దురదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2022, 11:41 AM IST
Budh Gochar 2022: ధనస్సు రాశిలోకి తిరోగమన బుధుడు... ఈరాశులకు కష్టాలే కష్టాలు..

Budh Gochar 2022: బుద్ధి, జ్ఞానం మరియు కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడు వచ్చే నెలలో ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, తిరోగమన బుధుడు (Retrograde Mercury 2022) డిసెంబరు 31, మధ్యాహ్నం 12:58 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధనస్సు రాశిలో తిరోగమన బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు పెరుగుతాయి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): సంచార సమయంలో బుధుడు ఈ రాశి వారి జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు. దీంతో వీరి వ్యాపారంలో నష్టాలు రావచ్చు. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. సంబంధాలు దెబ్బతినవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. 
వృషభం (Taurus); ఈ రాశికి చెందిన వ్యాపారులు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. పనిలో కూడా సమయం మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు కూడా టైం కలిసిరాదు. 
సింహరాశి (Leo): సంచార సమయంలో బుధుడు మీ జాతకంలోని ఐదవ ఇంట్లో ఉంటాడు. దీంతో మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెద్దగా ఉండవు. ఉద్యోగులకు ఈ సమయం అంతగా కలిసిరాదు.  ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. 

కన్య (Virgo): ఈ రాశి వారికి బుధుడు లగ్నానికి మరియు రెండవ ఇంటికి అధిపతి. మీ జాతకంలో నాల్గవ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. ఆఫీసులో కొన్ని సమస్యలు ఉండవచ్చు. వ్యాపారంలో కూడా అడ్డంకులు ఏర్పడవచ్చు. బంధాలు దెబ్బతినవచ్చు.  
వృశ్చికరాశి (Scorpio): తిరోగమన బుధుడి వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని అంత తొందరగా సాధించలేరు. వ్యాపార, ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. 

Also Read: Mars Transit 2022: కుజుడి 'విపరీత రాజయోగం'... ఈ 3 రాశులవారి లైఫ్ ఛేంజ్ అవ్వడం ఖాయం..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News