Budh Uday 2023: ఈ రోజు నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది... మీ రాశి ఉందా?

Mercury Rise 2023: ఇవాళ బుధడుు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2023, 07:50 AM IST
Budh Uday 2023: ఈ రోజు నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది... మీ రాశి ఉందా?

Budh Uday 2023 in Cancer: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. సంపద, తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇవాళ అంటే జూలై 11న అదే రాశిలో ఉదయించబోతున్నాడు. బుధుడి పెరుగుదల మెుత్తం 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బుధుడి ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 

మిథునరాశి: బుధుడు ఉదయించడం వల్ల మిథున రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు భూమి, ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
కన్య: మెర్క్యూరీ రైజింగ్ వల్ల కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు పొందుతారు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. మీ గౌరవం పెరుగుతుంది. 

Also Read: Shani Vakri 2023: శని వక్రి కారణంగా 4 నెలల పాటు ఈ రాశులవారి జీవితాలు మారబోతున్నాయి!

మకరం: బుధుడు ఉదయించడం వల్ల మకర రాశి వారు శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి వస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Venus Transit 2023: ఆగస్టు 7 వరకు ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News