Maha Shivratri 2021 Date, Puja Muhurat : మహా శివరాత్రి.. హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినం. మహాదేవుడైన శివుడుని భక్తితో కొలుస్తూ పూజలు చేస్తారు. శివుడు, జగన్మాత పార్వతి వివాహం జరిగిన రోజును మహా శివరాత్రి పండుగగా జరుపుకుంటాం. కొన్ని పురాణాలలో శివుడు తొలిసారిగా లింగాకరంలో దర్శనమిచ్చింది సైతం ఇదే రోజు అని పెద్దలు చెబుతుంటారు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
శివపార్వతుల కళ్యాణంతో లోకకళ్యాణం జరిగిందని, విజ్ఞానం, సానుకూల శక్తులు ఏకమై సమస్త మానవాళికి మేలు చేకూరుస్తాయి. ఇలాంటి పవిత్రమైన రోజున జాగారం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కొందరు ఒకపూట, మరికొందరు రెండు పూటలు ఏ ఆహారాన్ని స్వీకరించారు. మహా శివరాత్రి(Maha Shivaratri 2021) రోజున కొందరు సాయంత్రం వేళ హారతి ఇచ్చి ఫలాలు, అల్పాహారం మాత్రమే తీసుకుంటారు. మరికొందరు ఏ ఆహారం, ఫలాలు కూడా స్వీకరించకుండా భక్తి శ్రద్ధలతో శివరాత్రి జరుపుకుంటారు.
Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు
మహా శివరాత్రి 2021 వేళ..
ఈ సంవత్సరం మార్చి 11వ తేదీన మధ్యాహ్నం 2.39కి చతుర్దశి తిథి ప్రారంభం అవుతుంది. 24 గంటలకు పైగా అదే తిథి కొనసాగుతుంది. అంటే మార్చి 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పుణ్య తిథి పూర్తవుతుంది.
పూజకు ముహూర్తం..
మహా శివరాత్రి పర్వదినాన అర్థరాత్రి సమయంలో పూజకు శుభ ముహూర్తం ఉంది. 11వ తేదీ అర్థరాత్రి దాటిన తరువాత (మార్చి 12న) 12.06 నిమిషాలకు శుభ ముహూర్తం ఉంది. 12.55 నిమిషాలకి పూజ ముహూర్తం పూర్తవుతుంది. అయితే పూజ చేయడానికి మరికొన్ని ముహుర్తాలను కూడా సూచిస్తున్నారు.
Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది
శివరాత్రి పారానా సమయం: మార్చి 12న ఉదయం 6:34 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3:02 గంటల వరకు
శివరాత్రి ప్రహర్ 1 పూజ ముహూర్తం - సాయంత్రం 6:27 నిమిషాల నుంచి రాత్రి 09:29 నిమిషాల వరకు
శివరాత్రి ప్రహర్ 2 పూజ ముహూర్తం - రాత్రి 9:29 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12:31 నిమిషాల వరకు
శివరాత్రి ప్రహర్ 3 పూజ ముహూర్తం - మార్చి 11న అర్ధరాత్రి 12:31 నుంచి మార్చి 12వ తేదీ వేకువజాము 3:32 నిమిషాల వరకు
శివరాత్రి ప్రహర్ 4 - మార్చి 12వ తేదీ తెల్లవారుజామున 3.32 నిమిషాల నుంచి ఉదయం 6:34 నిమిషాల వరకు పూజ చేసుకునేందుకు శుభముహూర్తంగా పరిగణించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook