/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Lucky Zodiac Signs In 2024: తెలుగు క్యాలెండర్ ప్రకారం జులై 5 నుంచి ఆషాడ మాసం ప్రారంభమయ్యింది. ఈ నెలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే.. ఈ నెలలోనే కొన్ని ముఖ్యమైన గ్రహాలు కూడా సంచారం చేస్తాయి. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన నక్షత్రాల్లోకి కూడా గ్రహాలు ప్రవేశిస్తాయి. ఇదిలా ఉంటే ఆషాడ అమావాస్య సమయంలో మిథున రాశిలో బుధ గ్రహంతో పాటు చంద్ర గ్రహం రెండు సంయోగ దశలో ఉన్నాయి. దీనికి కారణంగా ఎంతో శక్తివంతమైన ధ్రువ యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడ్డాయి. అలాగే అతి త్వరలోనే  ఆరుద్ర నక్షత్రంలో కొన్ని గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. దీంతో కొన్ని గ్రహాల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఈ సమయం చాలా బాగుంటుంది.

తులారాశి: 
ఈ ప్రత్యేకమైన యోగాల కారణంగా తులా రాశి వారికి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. పాత ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా పనులు చేసే వారికి అధికారుల నుంచి బాధ్యతలు కూడా లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే డబ్బు సంపాదించేందుకు వీరు అనేక మార్గాలను పొందుతారు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా లాభసాటిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, మాధుర్యం కూడా పెరుగుతుంది.

సింహరాశి: 
సింహ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వీరు ఎలాంటి పనులు చేసిన మంచి విజయాలు సాధిస్తారు. అలాగే ఎలాంటి ప్రయత్నాలు అయినా ఫలిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి. ఆర్థికంగా కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు వీరికి ఈ సమయంలో స్థిరంగా ఉంటాయి. సింహ రాశి వారికి సమాజంలో మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా కొత్త మిత్రులు కూడా పరిచయం అవుతారు.

వృషభ రాశి: 
వృషభ రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి గుర్తింపు పొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వీరు కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పొందగలుగుతారు. అలాగే కఠినమైన పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధించేందుకు అద్భుత శక్తిని కలిగి ఉంటారు. ఇక ఆర్థికపరంగా చూస్తే ఈ రాశి వారికి ఎప్పటికప్పుడు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.. దీని కారణంగా మంచి లాభాలు పొందడమే కాకుండా పెట్టుబడులు కూడా పెడతారు. వ్యక్తిగత జీవిత విషయానికొస్తే వీరికి మానసికంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పెరిగి అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ధనస్సు రాశి: 
ధనస్సు రాశి వారికి కూడా ఉద్యోగ పరంగా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ సమయంలో వీరికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. ఇక ఆర్థికపరంగా చేస్తే వీరు పొదుపు పై ప్రత్యేకమైన దృష్టి సాధించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. అంతే కాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే లాభాలు కూడా పొదుపుగా మారుతాయి. వ్యక్తిగత జీవితంలో వీరికి ఆనందం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా గొడవలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే వీరు పిల్లలనుంచి కూడా శుభవార్తలను వింటారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Lucky Zodiacs: These 4 Zodiac Signs Will Get Huge Bank Balance In Ashada Masam 2024 Dh
News Source: 
Home Title: 

Lucky Zodiacs: ఆషాడ మాసంలో అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు..

Lucky Zodiacs: ఆషాడ మాసంలో అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు..
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆషాడ మాసంలో అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Sunday, July 7, 2024 - 10:49
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
26
Is Breaking News: 
No
Word Count: 
412