Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి 

రళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబ‌రి‌మల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy Temple) దర్శనానికి నేటినుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో ఆలయంలో కోలాహలం మొదలైంది. అయితే కరోనా పరీక్ష అనంతరం నెగిటివ్ అని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ (Travancore Devaswom Board) స్పష్టంచేసింది.

Last Updated : Nov 16, 2020, 09:10 AM IST
Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి 

Sabarimala Ayyappa Swamy Temple opens today: న్యూఢిల్లీ: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబ‌రి‌మల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy Temple) దర్శనానికి నేటినుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో ఆలయంలో కోలాహలం మొదలైంది. అయితే కరోనా పరీక్ష అనంతరం నెగిటివ్ అని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ (Travancore Devaswom Board) స్పష్టంచేసింది. అయితే రెండు నెలలపాటు జరగనున్న వార్షిక మండల మకరవిళక్కు పూజల కోసం దేవ‌స్థా‌నాన్ని ఆదివారం సాయంత్రం అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరి‌చారు. దీంతో నేటి నుంచి భక్తు‌లను దర్శనా‌నికి అను‌మ‌తిస్తున్నారు. 

కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నేప‌థ్యంలో దర్శనా‌లపై ట్రావె‌న్‌‌కోర్‌ దేవ‌స్వామ్‌ బోర్డు (TDB) మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రోజుకు వేయి మంది చొప్పున, శనివారం, ఆదివారంలో రెండు వేల మంది చొప్పున భక్తు‌లను దర్శనా‌నికి అను‌మ‌తించనున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే భక్తులు తప్పని‌స‌రిగా కరోనా నెగె‌టివ్‌ ధ్రువీ‌క‌రణ పత్రాన్ని తెచ్చు‌కుంటేనే లోపలికి అనుమతిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పంపాకు చేరుకునే రహదారిలో కరోనా పరీక్ష కేంద్రా‌లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పంపా నదిలో స్నానాలపై నిషేదం విధించారు. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి, పదేళ్ల లోపు పిల్లలకు శబరిమలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా (covid-19 guidelines) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బోర్టు పేర్కొంది.

Soumitra Chatterjee: బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News