Lucky Zodiac Signs: ఈ 4 రాశుల వారికి ఈ 30 రోజులు డబ్బేడబ్బు.. పట్టిందల్లా బంగారమేనట!

Lucky Zodiac Signs: గ్రహాలన్నింటిలో గురుడిని అదృష్టానికి ప్రతీకగా చెబుతుంటారు జ్యోతిష్యులు. అయితే వచ్చే నెల గురుడు దీర్ఘకాలం అస్తవ్యస్తంగా ఉండనున్నాడు. ఈ సమయంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 11:13 PM IST
  • దాదాపు నెల రోజులపాటు అస్తమించనున్న గురుడు
  • శత్రు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం
  • మిగతా రాశుల వారికి నివారణ సూచనలు..
Lucky Zodiac Signs: ఈ 4 రాశుల వారికి ఈ 30 రోజులు డబ్బేడబ్బు.. పట్టిందల్లా బంగారమేనట!

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఈ గ్రహం అత్యంత శుభప్రదంగా (Significance of Jupiter) పరిగణించబడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారకం.. ఎవరి జాతకంలోనైనా గురువు శుభ స్థానంలో ఉంటే, ఆ వ్యక్తి అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు.

గురు గ్రహం శ్రేయస్సు, వివాహం, వైభవం, శుభప్రదమైన పనులకు సూచికగా ఉంటుంది. అందుకే గురువు అస్తమించగానే అన్ని శుభకార్యాలు (Lucky Zodiac Sign) నిలిపివేస్తుంటారు.

అంతటి ప్రత్యేకత కలిగిన గురుడ.. ఫిబ్రవరి 24న అస్తమించి, మార్చి 26న ఉదయిస్తాడు. అంటే 30 రోజుల పాటు అదృష్టానికి ప్రతీక అయిన గురు గ్రహం.. అస్తవ్యస్తంగా (Jupiter set) ఉంటాడు.

భౌతిక ఆనందాలపై దృష్టి ఉంటుంది

గురుడు అస్తమించడం వల్ల డబ్బు, భౌతిక పరమైన ఆనందాల పట్ల ప్రజలకు ఆకర్షణ పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. సుఖాలను ఎక్కువగా కోరుకుంటారని అంటున్నారు.

బృహస్పతి బంగారానికి కూడా ప్రతీక కాబట్టి.. ఈ నెల రోజులు పసిడి ధరల్లో చాలా హెచ్చుతగ్గులు వస్తాయి అంచనా వేస్తున్నారు. షేర్ మార్కెట్లు కూడా అస్తిరతతో ఉంటాయని చెబతున్నారు. అందుకే మదుపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఆ రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుందట..

గురుడు వచ్చే నెలలో అస్తమించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శత్రు రాశులుగా పిలిచే.. వృషభ, తుల, మిథున, కన్యా రాశుల వారికి ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయా రాశుల వారికి కెరీర్ గొప్పగా ఉంటుందంటున్నారు. ఆదాయ మార్గాలు పెరగటం, కుటుంబంలో సంతోషంగా గడుస్తుందని చెబుతున్నారు.

మిగతా రాశుల వారు ఇలా చేయడం మంచిది..

గురువు అస్తమించడం వల్ల ఎవరికి అశుభ ఫలితాలను ఉంటాయే.. వారు కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు. పసుపు బట్టలు, పసుపు వస్తువులను దానం చేయాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అరటి చెట్టును పూజించాలని కూడా సలహా ఇస్తున్నారు. గురుడు అస్తమించడం వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయని అంటున్నారు.

(గమనిక: పై సమాచారం జ్యోతిష్య నిపుణుల అనుభావల ఆధారంగా మాత్రమే చెప్పడం జరిగింది. ఇందులోని విషయాలను ZEE NEWS ధృవీకరించలేదు.)

Also read: Success Mantra: ఇలా చేస్తే మీ ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది!!

Also read: Srivari Darshanam Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, శ్రీవారి టికెట్లు విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News