Horoscope January 7 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శత్రువుతో సయోధ్య కుదిరే ఛాన్స్

Horoscope January 7 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి సానుకూల సమయం. నిస్సందేహంగా కొత్త పనులు లేదా ప్రాజెక్టులు మొదలుపెట్టవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 09:04 AM IST
  • నేటి రాశి ఫలాల్లో కొన్ని రాశుల వారికి పూర్తిగా అనుకూల సమయం
  • కొన్ని రాశుల వారిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి
  • ఆ రాశి వారికి శత్రువుతో సయోధ్య కుదిరే ఛాన్స్
Horoscope January 7 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శత్రువుతో సయోధ్య  కుదిరే ఛాన్స్

Horoscope January 7 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా కొంత ఇబ్బందులు వెంటాడుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మరికొన్ని రాశుల వారికి ఇవాళ ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఊహించని రీతిలో, ఊహించని వ్యక్తుల నుంచి ధన లాభం పొందే అవకాశం ఉంది.

మేషం :  మీరు చేసే పని లేదా సంపాదన మార్గాలకు మరింత కృషి చేయండి. భావోద్వేగపూరిత జీవితాన్ని తలుచుకుని బాధపడకండి. ఇవాళ మీరు ఊహించని వ్యక్తుల నుంచి ధనాన్ని పొందుతారు. వినోదాత్మక విషయాలకు సంబంధించి ఎటువంటి సంకోచం అవసరం లేకుండా ముందుకెళ్లవచ్చు. లక్కీ కలర్: కాషాయం, లక్కీ నంబర్: 2 

వృషభం : వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఇవాళ్టికి పక్కన పెట్టండి. నిర్ణయాలకు ఇవాళ అనుకూల సమయం కాదు. ఇతరులతో కొన్ని విషయాల్లో కమ్యూనికేట్ అయ్యేందుకు కొంత ఇబ్బంది పడుతారు. ఇవాళ పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. లక్కీ కలర్ : ప్లమ్, లక్కీ నంబర్ : 3 

మిథునం : మీ భార్యతో బంధం మరింత బలపడుతుంది. మీపై అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ఫీలింగ్స్ మరింత వికసిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్కీ కలర్ : హానీ, లక్కీ నంబర్ : 8

కర్కాటకం : వృత్తిపరమైన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. పని ఒత్తిళ్లు, ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం కోసం ఇవాళ పనుల నుంచి బ్రేక్ తీసుకోండి. వీలైతే పాత స్నేహితులతో కలిసి షాపింగ్‌కి వెళ్లండి. కొన్ని విషయాల్లో కొంత సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. లక్కీ కలర్ : తెలుపు, లక్కీ నంబర్ : 4

సింహం : ఈ రాశివారికి ఇవాళ కెరీర్ పరంగా అన్ని విధాలా కలిసొస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకున్న నమ్మకం, మీ స్కిల్స్‌ను ప్రపంచానికి కూడా తెలియజేయండి. మీ ఆహారపు అలవాట్లపై దృష్టి సారించండి. మద్యపానాన్ని విడనాడండి. లక్కీ కలర్ : వయొలెట్, లక్కీ నంబర్ : 6

కన్య : మీకు ఛాలెంజ్‌లను స్వీకరించే గుణం ఉంటే... రిస్క్ చేసేందుకు వెనుకాడనివారైతే.. ఆ పనులను ఇవాళ స్వీకరించండి. వాటిని విజయవంతం చేసేందుకు తగిన ప్రయత్నం, కృషి చేయండి. ఇవాళ మీ శత్రువుతో సయోధ్య కుదిరే అవకాశం ఉంది. లక్కీ కలర్ : టీల్, లక్కీ నంబర్: 9

తుల : ఇవాళ మీకు పూర్తిగా అనుకూల సమయం. కొత్త ఇల్లు, కొత్త జ్ఞానం, కొత్త జాబ్, కొత్త స్కిల్స్.. వీటిల్లో ఇవాళ ఏదో ఒకటి మిమ్మల్ని మరింత పురోగతి చెందిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. లక్కీ కలర్ : ఇండిగో, లక్కీ నంబర్ : 1

వృశ్చికం: ప్రయాణాలకు అనువైన సమయం. ప్రేమ జీవితం వికసిస్తుంది. అయితే కొంత జాగ్రత్త వహించాలి. గృహపరమైన కార్యక్రమాలకు.. ముఖ్యంగా ఇల్లు వెతుక్కునేందుకు ఇవాళ మంచి రోజు. ఇతరుల కమిట్‌మెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడవద్దు. అలా చేస్తే నిరాశకు గురవుతారు. లక్కీ కలర్ :అంబర్, లక్కీ నంబర్: 5

ధనుస్సు : పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. వారితో కలిసి ప్రయాణిస్తారు. మీ కెరీర్‌ ఆశాజనకంగా ఉంటుంది. కెరీర్ పరమైన విషయాల్లో సరైన దిశా నిర్దేశంతో ముందుకెళ్లండి. గందరగోళ నిర్ణయాలను పక్కన పెట్టండి. లక్కీ కలర్ : లిలక్, లక్కీ నంబర్ : 3

మకరం : ఆర్థిక లావాదేవీలు కాస్త నిధానిస్తాయి. ఇల్లు, కుటుంబ సంబంధిత విషయాలు హైలైట్ అవుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కొన్ని ఒప్పందాల కారణంగా అదనపు డబ్బు చేకూరుతుంది. స్థిరాస్తి పెట్టుబడులు లాభిస్తాయి.  లక్కీ కలర్: లావెండర్, లక్కీ నంబర్ : 7

కుంభం : బంధు మిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. మిమ్మల్ని చాలాకాలంగా చికాకు పెడుతున్న విషయాల్లో కాస్త రిలీఫ్ దొరుకుతుంది. కొత్త కమిట్‌మెంట్స్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. నూతన ఉత్సాహంతో కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. లక్కీ కలర్: నారింజ, లక్కీ నంబర్: 8 

మీనం : కొన్ని విషయాల్లో ప్రతిస్పందన కంటే వినడం ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చు. మీకు ఇష్టమైనవారు మీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. గత అనుభవాల నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం గత అనుభవాలను ఒకసారి బేరీజు వేసుకుని కొత్త పనుల్లో ముందుకు సాగాలి. లక్కీ కలర్ : రెడ్, లక్కీ నంబర్: 2

Also Read: Mahesh Babu tested Corona Positive: మహేశ్​ బాబుకు కరోనా పాజిటివ్​- స్వయంగా వెల్లడి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News