Grah Gochar 2022: నవంబర్ నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా మరి..

Grah Gochar 2022: నవంబర్‌లో కొన్ని  ప్రధాన గ్రహాలు సంచరించనున్నాయి. వీటి సంచారం కారణంగా కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 12:37 PM IST
Grah Gochar 2022: నవంబర్ నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా మరి..

November Planetary Sign Changes 2022: నవంబర్ నెలలో అనేక గ్రహాల గమనంలో మార్పు రాబోతోంది. ఈ నెలలో 5 గ్రహాలు రాశిచక్రాన్ని మారుస్తాయి. దీని ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, నవంబరు నెల (Grah Gochar November 2022) కొన్ని రాశులవారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఈ నెలలో ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

మిథునరాశి (Gemini): మిథున రాశి వారికి నవంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది.విద్యకు సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహ రాశి(Leo): నవంబర్ మాసం సింహరాశి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈనెలలో మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు.  ఆదాయం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.  
కర్కాటక రాశి (Cancer): నవంబర్ నెల కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగానే ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. 
కన్యా రాశి(Virgo): నవంబర్‌లో గ్రహాల సంచారం కన్యా రాశి వారికి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త పనులను ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు శుభవార్త వింటారు. మీకు పనిలో మీ సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వ్యాపారుస్తులు భారీగా లాభం పడనున్నారు. 
మకర రాశి (Capricorn): నవంబర్ మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ నెల కెరీర్ పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. డబ్బు వృథా తగ్గుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలను  ఆర్జిస్తారు.  

Also Read: Saturn Transit 2023: కుంభరాశిలో శని సంచారం.. శనిమహాదశ నుండి ఈ రాశులకు విముక్తి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News