February 2025 Planetary Transits: ఈ 2025 ఏడాదిలోని ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్య గ్రహంతో పాటు అంగారక గ్రహాలు ఇతర రాశుల్లోకి ప్రవేశించబోతున్నాయి. ఈ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు కూడా రెండు సార్లు సంచారం చేయబోతున్నాడు. ఫిబ్రవరి నెలలో 12వ తేదిన సూర్యుడు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే దీనికి ముందు రోజు బుధుడు శని పాలించే గ్రహం కుంభంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇక ఫిబ్రవరి 4న బృహస్పతి గ్రహం వృషభరాశిలోకి సంచారం చేయబోతోంది.
ఫిబ్రవరిలో ఈ గ్రహాల మార్పుల కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి.
మిథునరాశి
ఫిబ్రవరిలో జరిగే గ్రహాల మార్పుల కారణంగా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు ఆర్థిక లాభాల రూపంలో కలిసి వస్తుంది. అంతేకాకుండా వివాహాలు కనివారికి మంచి భాగస్వామి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా బాగుంటుంది.
మేష రాశి
ఫిబ్రవరి నెలలో మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాలు కూడా వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అలాగే మతపరమైన విషయాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది.
సింహ రాశి
సింహ రాశివారికి కూడా ఈ ఫిబ్రవరి నెల ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. వీరు ఈ సమయంలో శుభవార్తలు వినడమే కాకుండా అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా ఎంతో సులభంగా పొందుతారు. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే వీరు ఈ సమయంలో పోటీ పరీక్షలు రాస్తే విజయాలు కూడా సాధిస్తారు.
కుంభ రాశి
ఈ ఫిబ్రవరి నెలలో శని పాలించే కుంభరాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరి జీవితంపై కూడా సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన బంఫర్ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ కుంభరాశి వారికి అనుకున్న పనుల్లో కూడా విజయాలు లభించి, ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter