Tirupati latest updates: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతటి ప్రత్యేకతను సంతరించుకుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ గత కొంతకాలంగా ఈ పుణ్యక్షేత్రంలో అపచార సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మొదట తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే వ్యవహారం, ఆ తర్వాత తొక్కిసలాట జరగడం.. అలాగే మాంసాహారం, మద్యం సేవించడం వంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తిరుమల కొండపైకి చేరుకున్న భక్తులు చేసిన ఒక నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.
తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తాము తెచ్చుకున్న ఆహారపు డబ్బాలలో ఒక డబ్బా నిండా కోడిగుడ్లు, పలావును అలిపిరి నుంచి తిరుమలకు తెచ్చుకున్నారట. అయితే అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటుకొని వచ్చినప్పటికీ తిరుమల కొండపైన ఈ భక్తులు కోడిగుడ్లు పలావు తింటూ ఉండగా ఇతర భక్తుల సైతం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా అక్కడ చేరుకున్న పోలీసులు సైతం ఈ తమిళనాడు భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సైతం స్వాధీనం చేసుకొని మరి సీజ్ చేశారట.
తిరుమలలో నిషేధిత పదార్థాలు ఉన్న సంగతి అవగాహన లేకపోవడంతోనే ఈ తప్పులు జరిగాయని ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ పోలీసులకు ఆ తమిళనాడు భక్తులు వివరించారట. దీంతో పోలీసులు ఆ భక్తులను సైతం మందలించి మరొకసారి తిరుపతిలో ఇలాంటి కార్యకలాపాలకు చేపట్టకూడదంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట.
అయితే ఇలాంటి ఆహార పదార్థాలను అలిపిరి చెక్‌పోస్ట్ దాటి కొండపైకి చేరుకున్న తీరుతో ఒక్కసారిగా తనిఖీ కేంద్ర వైఫల్యం పైన చాలా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో తిరుమల కొండ పైన వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడంతో టీటీడీ పనితీరుపైన చాలానే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటివి జరగకుండా టీటీడీ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Also Read: YS Sharmila: 'సూపర్ సిక్స్ ఇవ్వలేక.. ఆడలేక మద్దెల దరువన్నట్టు చంద్రబాబు తీరు'
Also Read: Muppa Raja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సస్పెండ్ ద లీడర్'.. ముప్పా రాజాపై వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.