Lucky Zodiac Signs: లక్ష్మీదేవికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Lucky Zodiac Signs: కొంత మంది దేవతలకు మెుత్తం 12 రాశిచక్రాల్లో కొన్ని రాశులవారు అంటేనే ఇష్టం. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకుందాం. ఈ రాశులవారికి దేనికీ లోటు ఉండదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 03:04 PM IST
Lucky Zodiac Signs: లక్ష్మీదేవికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Goddess lakshmi Devi favorite zodiac signs: పురాణాల ప్రకారం, లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి(lakshmi Devi) అనుగ్రహం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ తమపై ఆ తల్లి కటాక్షం ఉండాలని కోరుకుంటారు. అందుకే భక్తులు నిత్యం ఆ మాతను పూజిస్తారు. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం, లక్ష్మీదేవి కృప కొన్ని రాశులవారిపై మాత్రమే ఉంటుంది. ఆ దేవికి ఆ రాశులవారు అంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వారిపై ఎల్లప్పుడూ తన దయను చూపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

తులారాశి
తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశివారి పై లక్ష్మీదేవి యెుక్క అనుగ్రహం ఉంటుంది. దీంతో ఈ రాశివారికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. లక్ష్మీదేవి దయ వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా పురోగమిస్తారు. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. 
వృషభం
లక్ష్మీదేవికి ఇష్టమైన రాశిచక్రాలలో వృషభం కూడా ఒకటి. వీరిపై ఆ తల్లి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. దాని కారణంగా ఈ రాశి వారికి ధనానికి లోటు ఉండదు. 
కర్కాటకం
కర్కాటక రాశికి అధిపతిగా చంద్రుడిని భావిస్తారు. అందుకే ఈ రాశివారిపై లక్ష్మీదేవికి ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఆ దేవి దయ వల్ల వీరు ఆర్థికంగా బలపడతారు. వారి ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి. 
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. లక్ష్మీదేవి కటాక్షం ఈ రాశి వారిపై కూడా ఉంటుంది. ఈ రాశివారి సమస్యలన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా మునుపటి కంటే బలంగా ఉంటారు. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Shani Margi 2023: దీపావళికి ముందే ఈ 3 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News