Zee Telugu News Bonalu Song: ఆషాడ మాసం, శ్రావణ మాసం అంటే తెలంగాణ వాసులకు ముందుగా గుర్తుకొచ్చేది బోనాల పండుగే. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో బోనాల పండుగ అంటే మామూలు హడావుడి ఉండదు.. మిగతా పండగలన్నీ ఓ ఎత్తయితే, బోనాల పండగ మరో ఎత్తు. హైదరాబాద్ భాగ్యనగరం నుండి పల్లెటూర్ల వరకు పల్లెపల్లెనా పండగ వాతావరణం నింపే బోనాల ఉత్సవాల ముందు ఏదీ సాటి రాదు. హైదరాబాద్‌లో గోల్కొండ ఖిలాలో అమ్మవార్లకు జనం తొలి బోనమెత్తగా.. పాత బస్తీలో లాల్ దర్వాజ బోనాలు, సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి సమర్పించే లష్కర్ బోనాలు.. ఇలా నగరం నలుమూలలా ప్రతీ ఆదివారం ఏదో ఓ చోట పోతరాజుల సందడితో, బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో శోభాయమానంగా కనిపిస్తుంది.
మిగతా అన్ని పండగలకు హైదరాబాద్ ఖాళీ అయి సొంతూరి బాట పడితే.. హైదరాబాద్‌లో జరిగే బోనాల పండగ మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉన్న తోబుట్టువులను, అయిన వారిని అక్కున చేర్చుకుంటుంది. హైదరాబాద్‌లో ఒక నెల ముందుగానే.. అంటే ఆషాడ మాసంలోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమై శ్రావణ మాసం చివరి వరకు జరిగితే... పల్లెటూళ్లలో శ్రావణమాసంలో మాత్రమే బోనాల పండగ జరుగుతుంది. బంధుమిత్రుల కోలాహలం మధ్య వేడుక చేసుకునే బోనాల పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అందుకే అమ్మవార్లకు బోనం సమర్పిస్తూ, అందరికీ సకల శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ జీ తెలుగు న్యూస్ బోనాల పండగ శుభాకాంక్షలతో ఓ పాటను విడుదల చేయడం జరిగింది. '' అమ్మా హే జగదంబే.... అంబే... అంబే... సౌభాగ్యదాయి '' అంటూ జీ తెలుగు న్యూస్ రూపొందించిన బోనాలు సాంగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇదిగో జీ తెలుగు న్యూస్ బోనాల సాంగ్ మీ కోసం..
అమ్మా హే జగదంబే సాంగ్ లిరిక్స్
అమ్మా హే జగదంబే....
అంబే...అంబే... సౌభాగ్యదాయి
శివదూతీ ఛాముండే
అంబే ... అంబే . దుర్గాభవానీ .
అంబే ... అంబే . అంబే ....
ర్యాప్:-.పచ్చి యాప మండలంట. మెడల గవ్వలదండలంట ...
నెత్తిమీద కుండలంట.. నిమ్మకాయల మాలలంట ...
ఓం నమః శివాయ ....
ఓం నమఃశీవాయ
జగదాంబాదేవి మంగాళా రూపీ కౌమారీ బ్రాహ్మీ త్రిపురే నమామి.
" 2 "
ఉజ్జయినీ కాళీ కళ్యాణకారీ మధుకైటభ హారీ త్రీశూలధారీ "2 "
ర్యాప్:- ఇంటింటా బోనమంట ఊరూరా జాతరంట ఈతకల్లు సాకబోసి తల్లినీకు బోనమంట ఓం నమః శివాయ ....
ఓం నమఃశీవాయ ..
" అమ్మాహే "
మా భాగ్యనగరీ హే భాగ్యలక్ష్మీ పద్మాసన స్థిత కరుణామయి దేవి " 2 "
హే సింహవాహినీ మాంకాళీ దేవి/
దుష్ట సంహారిణీ అంబాభవానీ "2"
ర్యాప్:- పోతరాజు ఆటలంట శివసత్తుల సిందులంట
ఆషాడం మాసమంత తల్లినీకు జాతరంట .... ఓం నమః శివాయ ... ఓం నమః శివాయ ... "2"
" అమ్మాహే "
Amma he jagadambe song credits :
Lyrics : Subbu Tadepalli
Singer : sameeksha .T
Music : G.P Raviin(GPR STUIDIO)
Video Editor : Akhil
Camera : Nagarjuna Sagar.M
Gangarapu hemanth
Ravee
Cordinators : Sampath.T
Srinivas gooda
Supervision : Ravee
Execution & Editor zee telugu news :
Bharath Kumar .S
PRESENTS : ZEE MEDIA
Also Read : Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ రాశులవారిపై కనకవర్షం కురుస్తుంది!
Also Read : Sravanam Masam 2022: శ్రావణంలో ఈ రంగు దుస్తులు ధరించి శివుడిని పూజిస్తే... అంతులేని సంపద మీ సొంతం!
Also Read : Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ చిన్న చిన్న తప్పులు చేస్తే.. శివుడి ఆగ్రహానికి గురవుతారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook