Crocodile brutally attack on Big python video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు ఘటనలు వైరల్ గా మారుతుంటాయి. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చినకా.. ఎక్కడ ఏం జరిగిన కూడా వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. అంతేకాకుండా.. వెరైటీగా ఉన్న కంటెంట్ లు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. పాముల వీడియోలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. పాములు,కొండ చిలువలు ఎక్కువగా గుట్టలు, చెట్లు, పొదల్లో ఉంటాయి. ఇవి కొన్నిసార్లు మనుషుల ఆవాసానికి కూడా వస్తుంటాయి.
అడవులకుదగ్గరగా ఉండే ఇళ్లలో పాములు, కొండ చిలువలు రావడం వల్ల జనాలు తీవ్రఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు పాముల కాటుకు కూడా గురౌతున్నారు. ఈ క్రమంలో కొంత మంది పాములు లేదా కొండ చిలువలు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక కోండ చిలువకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పూర్తి వివరాలు..
అడవిలో ఒక భారీ మొసలి కొండ చిలువను చూసింది. అదివెంటనే స్పీడ్ గా వెళ్లి కొండ చిలువను నోటిలో కర్చుకుని చుక్కలు చూపించింది. మొసలి పళ్లకు చాలా బలం ఉంటుందని అంటారు.అది గట్టిగా పట్టుకుంటే అంత ఈజీగా వదలదు. అందుకే.. మొసలిని నీళ్లలో ఉన్నప్పుడు.. ఏ జంతువు కూడా డిస్టర్ట్ చేసే సహాసం అస్సలు చేయవు. ఏనుగును సైతం.. మొసలి నీళ్లలో ఉన్నప్పుడు.. భయపడెతుంది.
సింహాలు. పులులు సైతం.. మొసలిని చూసి దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇక్కడ ఒక మొసలికి నీళ్లలోనే కాదు.. భూమి మీద కూడా అంతే శక్తి ఉన్నట్లు ఉంది. అది ఏకంగా కొండ చిలువ మీద దాడికి తెగబడింది. పదునైన తనపళ్లతో కొండ చిలువను పట్టుకుని, గట్టిగా కొరికేస్తుంది.
Read more: Romance Video: బస్సులో రెచ్చిపోయిన లవర్స్.. సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ హల్ చల్.. వీడియో వైరల్..
పాపాం.. మొసలి దాడికి కొండ చిలువ విలవిల్లాడిపోయింద. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. అంటూ షాక్ కు గురౌతున్నారు. మరికొందరు మాత్రం.. ఇదేం దాడి బాబోయ్ అంటూ.. భయంతో కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.