Viral video: కప్పే కదా అని లైట్ తీస్కోవద్దు.. వైరల్ వీడియో

లాక్ డౌన్ సమయం కావడంతో సోషల్ మీడియాలోకి ఎటువంటి ఆసక్తికరమైన వీడియో వచ్చినా.. అది వెంటనే వైరల్ అయిపోతోంది. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి. కప్పే కదా.. ఏం చేస్తుంది లే అని లైట్ తీస్కోవద్దు.. కోపమొస్తే కప్ప అయినా తిరగబడుతుందనిపించేలా ఉన్న ఈ గమ్మత్తయిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Last Updated : Apr 22, 2020, 07:55 PM IST
Viral video: కప్పే కదా అని లైట్ తీస్కోవద్దు.. వైరల్ వీడియో

లాక్ డౌన్ సమయం కావడంతో సోషల్ మీడియాలోకి ఎటువంటి ఆసక్తికరమైన వీడియో వచ్చినా.. అది వెంటనే వైరల్ అయిపోతోంది. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి. కప్పే కదా.. ఏం చేస్తుంది లే అని లైట్ తీస్కోవద్దు.. కోపమొస్తే కప్ప అయినా తిరగబడుతుందనిపించేలా ఉన్న ఈ గమ్మత్తయిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటి ఆవరణలోకి వచ్చిన ఓ పెద్ద కప్పను బూటుతో వెనక నుంచి తీసేయ్యబోతే.. అది మాత్రం ఈ ఘటనను షూట్ చేస్తున్న వాళ్ల చేతుల్లో ఉన్న కెమెరాపైకి ఎగ్గిరి కూర్చుంది. కప్ప ఇచ్చిన షాక్ కి ఎగిరి వెనక్కి పడటం ఈ వీడియో షూట్ చేసిన వారి వంతయ్యింది.

@et_phonehome144

Sometimes bad things happen to good people ...😬🤣 ##fyp ##foryoupage ##poorsister ##waitforit ##everythingisbiggerintexas

♬ original sound - et_phonehome144

టెక్సాస్‌కి చెందిన ఎమిలి అనే టిక్ టాక్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ వీడియోకు భారీ స్పందన కనిపించింది. లక్షలాది మంది వీడియోను లైక్ కొట్టగా.. వేలాది మంది కామెంట్ చేశారు. ఇంకొన్ని వేల మంది ఈ వీడియోను సరదాగా షేర్ చేసుకున్నారు.

Trending News