TMC MP Sunil Mandal: టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడిన ఎంపీ

TMC MP Sunil Mandal Attack on Toll Plaza Staffer: ఎంపీ కారు దిగి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటం గమనించిన ఎంపీతో కలిసి కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారు దిగి ఎంపీని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాత్రం వినిపించుకోకుండా ఉజ్వల్‌పై దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి.

Written by - Pavan | Last Updated : Aug 5, 2023, 11:53 AM IST
TMC MP Sunil Mandal: టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడిన ఎంపీ

TMC MP Sunil Mandal Attack on Toll Plaza Staffer: ప్రజాప్రతినిధులం అనే అహంకారం కొంతమంది రాజకీయ నాయకులను కాలు, కళ్లు రెండూ నేలపై నిలపనివ్వడం లేదు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులపై, ప్రైవేటు సిబ్బందిపై చేయి చేసుకుంటున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నేతల్లో ఈ విపరీత పోకడలు ఎక్కువగా కనిపించడం తరచుగా పతార శీర్షికలకు ఎక్కుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగ పశ్చిమ బెంగాల్లో అక్కడి అధికార పార్టీ నేత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సునీల్ మండల్ తన కారు వెళ్తున్న మార్గంలో ఉన్న ఓ టోల్ గేట్ సిబ్బందిపై ఇష్టారీతిన చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టోల్ ప్లాజాలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలిస్తే.. టోల్ ప్లాజాలోకి తన కారులో వచ్చిన ఎంపీ సునీల్ మండల్.. నేరుగా వీఐపి కియోస్క్ వైపున్న మార్గంలోకి వెళ్లాడు. సునిల్ మండల్ కారుపై అది ఎంపీ వాహనం అని తెలియజేసేలా ఎలాంటి స్టిక్కర్ కానీ లేదా లోగో కానీ లేదు. దీంతో ఈ వాహనం వీఐపి రూట్లో ఎందుకు వస్తోంది అన్నట్టుగా అక్కడే ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది ఉజ్వల్ సింగ్ ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయాడు. కానీ సునిల్ మండల్ మాత్రం తన కారుని ఆపకుండా అక్కడే ఉన్న ట్రాఫిక్ సేఫ్టీ కోన్స్ ని నెట్టుకుంటూ ముందుకు పోనిచ్చాడు. అది చూసిన ఉజ్వల్ సింగ్ వెంటనే అతడి కారుకి అడ్డంగా ఉన్న కోన్స్ ని తొలగించేందుకు ముందుకు వచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిందన్నట్టుగా కోపోద్రిక్తుడైన ఎంపీ సునిల్ మండల్.. అతడిపైకి రెచ్చిపోయాడు. కారు దిగడంతోనే ఉజ్వల్‌పై ఆవేశంతో దాడికి పాల్పడసాగాడు. అసలు ఏం జరుగుతుందో, అతడు ఎవ్వరో, తనపై ఎందుకు దాడికి పాల్పడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోవడం ఉజ్వల్ సింగ్ వంతయ్యింది.

ఎంపీ కారు దిగి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటం గమనించిన ఎంపీతో కలిసి కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారు దిగి ఎంపీని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాత్రం వినిపించుకోకుండా ఉజ్వల్‌పై దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. 

ఇదే విషయంపై ఎంపీ సునీల్ చేతిలో దాడికి గురైన బాధితుడు ఉజ్వల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ వచ్చిన వ్యక్తి ఎంపీ సునీల్ మండల్ అనే విషయం తనకు తెలియదని.. ఆయన కారుపై ఎలాంటి ఎంపీ స్టిక్కర్ కూడా లేకపోవడం అయోమయానికి గురిచేసిందన్నాడు. సునిల్ కారుని ఆపకుండానే పోనివ్వడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ సేఫ్టీ కోన్ ఆయన కారుకి తగిలింది. వెంటనే వెళ్లి ఆ కోన్‌ని కారుకి అడ్డం లేకుండా తొలగించినప్పటికీ ఎంపీ సునిల్ కారు దిగి దాడి చేశాడని ఉజ్వల్ సింగ్ వాపోయాడు. 

ఇది కూడా చదవండి : Snake Bites Woman: యువతి పెదాలని గట్టిగా ముద్దాడిన పాము.. వీడియో వైరల్

టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి వీడియో వైరల్ అవడంతో అక్కడి స్థానిక ప్రజలే కాకుండా నెటిజెన్స్ సైతం టీఎంసీ ఎంపీ సునిల్ మండల్ వైఖరిపై మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి చిరు స్థాయి ఉద్యోగిపై దాడికి పాల్పడటానికి సిగ్గు లేదా అని ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఇందులో టోల్ ప్లాజా సిబ్బంది తప్పు ఏముంది.. అతడి డ్యూటీ అతడు చేశాడు అని బాధితుడికి అండగా నిలిచారు. ప్రజలకు సేవ చేయాల్సిన హోదాలో ఉన్న ప్రజాప్రతినిధివి అయ్యుండి ఒక సామాన్యుడిపై నువ్వే దాడి చేస్తే ఇక సామాన్యులకు అండగా నిలిచేది ఎవరని ఇంకొంతమంది నెటిజెన్స్ నిలదీశారు. ఒక ప్రజాప్రతినిధికి ఇంత అహంకారం పనికిరాదు అని హితవు పలుకుతున్నారు. మొత్తానికి ఈ ఘటనతో ఎంపీ సునిల్ సాధించింది ఏమీ లేదు కానీ ఇంకా అబాసుపాలయ్యేలా చేసింది. లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరిగిన ఘటన కావడంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సునిల్ మండల్ మరోసారి పోటీ చేస్తే అతడికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి : Giant Anaconda Snake Video: నిజంగానే ఇంత భారీ ఆనకొండ ఉంటుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News