Viral Video: ఆడవి గేదెను దారుణంగా వేటాడిన పులి, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..మీరు చూడొచ్చు!

Tiger Hunt Cattle Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ మారాయి. ఈ రోజు పులి గేదెను వేటాడిన వీడయో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మీరు ఈ వీడియోను చూశారా తప్పకుండా చూడండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 29, 2023, 10:28 AM IST
Viral Video: ఆడవి గేదెను దారుణంగా వేటాడిన పులి, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..మీరు చూడొచ్చు!

 Tiger Hunt Cattle Viral Video: పులులను అడవికి రారాజులుగా పిలుస్తారు. ఎందుకంటే ఇవి దూకుడు స్వభావంతో వేటాడానికి ఎంతో యాక్టివ్‌గా ఉంటాయి. ఇవి ఆకలేస్తే ఆ జంతువు, ఈ జంతువు అని చూడకుండా అన్ని జంతువులను సులభంగా వేటాడేస్తాయి. అయితే ప్రస్తుతం ఇలాంటి వేటాడే వీయోడి ఒకటి నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకున్న సంఘట ప్రస్తుతం నెటిజన్లకు భయం పుట్టిస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేసి చూడొచ్చు.

ఈ వీడియో ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌లో పులి ఆడవి గేదెను వేటాడిన సంఘటన అందరికీ భయం పుట్టిస్తోంది. ఈ వీడియో మీరు గమనిస్తే.. మేతలో భాగంగా గేదెలన్ని ఓ ప్రదేశంలో మేస్తుండగా.. ఒక్కసారిగా పులి వచ్చి గడ్డి మేస్తున్న ఆడవి గేదెను మొండాన్ని పట్టుకుని వేటాడింది. ఈ చిత్రాలను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ జయంత్ శర్మ అద్భుతంగా కెమెరాలో బంధించారు. అంతేకాకుండా పులి బలంగా బరువైన ఆడవి గేదెను లాక్కెళ్లడం చూసి అక్కడ వాహనంలో ఉన్న పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో విభిన్నంగా వారి అభిప్రాయాలు తెలుపుతున్నారు.

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jayanth Sharma (@jayanth_sharma)

ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ జయంత్ శర్మ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాత @Jayanth_Sharmaలో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇలా రాసుకుంటూ వచ్చాడు.. బాంధవ్‌ఘర్‌లోని మగ పులి పశువులను వేటాడడంలో బాస్‌..దీనిని 'ఝామోల్ మలే' అనే పేరుతో కూడా ఇక్కడి ప్రజలు పిలుస్తారని రాస్తూ వచ్చారు. అయితే ఈ వేటాడడం చూసిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా కొంత మంది వాహనంలో ఉన్న పర్యాటకు కేకలు కూడా వేయడం మీరు చూడొచ్చు. ఈ వీడియోను జయంత్ శర్మ  మూడు రోజుల క్రితం పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు ఈ దృశ్యలను నాలుగు వేల మంది కంటే ఎక్కువ నెటిజన్లు వీక్షించగా చాలా మంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తూ వచ్చారు. 

బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమారియా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ టైగర్ రిజర్వ్‌లో పార్క్‌ కూడా నిర్మించారు. దీనిని కోట రాముడు అనే స్థానికుడు నిర్మించారని సమాచారం. అందుకే బాంధవ్‌గర్ అని పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ టైగర్ రిజర్వ్‌లో 1968 సంవత్సరంలోనే ప్రారంభించారు. ఈ రిజర్వ్‌ చుట్టూ 32 కొండలుంటాయని సమాచారం. అందుకే జంతువులకు ఇక్కడ సులభంగా ఆహారం లభిస్తుంది. ఈ జాతీయ ఉద్యానవనంలో 23 జాతుల జంతువులతో పాటు  250 జాతుల పక్షులు నివసిస్తున్నాయి. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News