America: డేటింగ్​ కోసం అమ్మాయికి రెజ్యూమ్​...సోషల్ మీడియాలో వైరల్!

Dating Resume:ఓ రెజ్యూమ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ రెజ్యూమ్ ఉద్యోగం కోసం అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళితే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2021, 01:19 PM IST
  • యువకుడి ఆసక్తికర ఆలోచన
  • డేటింగ్ కు రమ్మని అమ్మాయికి రెజ్యూమ్
  • వైరల్ గా మారిన రెజ్యూమ్
America: డేటింగ్​ కోసం అమ్మాయికి రెజ్యూమ్​...సోషల్ మీడియాలో వైరల్!

Dating Resume:సాధారణంగా మనకు జాబ్ కావాలంటే...కంపెనీలకు రెజ్యూమ్ తయారు చేసి పంపుతుంటాం. ఎందుకంటే మన రెజ్యూమే మనల్ని ఆ కంపెనీకి పరిచయం చేస్తుంది. రెజ్యూమ్ ద్వారానే వారు మన స్కిల్స్ తెలుసుకుని...ఎప్రోచ్ అవుతుంటారు. అందుకే ఎక్కువ మంది అభ్యర్థులు రెజ్యూమ్ లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇంతకీ ఈ రెజ్యూమ్​ గురించి ఇప్పుడెందుకు చెబుతున్నా.. అంటారా..?..పదండి స్టోరీలోకి వెళ్దాం!

అమెరికా(America)లోని ఓ అబ్బాయి ఇలాంటి ఆసక్తికర రెజ్యూమ్(Resume) తయారు చేశాడు. దీంట్లో వింత ఏంటి అంటారా? ఆ అబ్బాయి రెజ్యూమ్​ పంపింది డేటింగ్​ కోసమంటా. అవును మీరు విన్నది నిజమే ఓ అమ్మాయితో డేటింగ్​(Dating) కోసమే. తనతో డేటింగ్​కి రమ్మని తన క్లాస్​మేట్(classmate)కి ఓ స్వీట్​ రెజ్యూమ్​ పెట్టాడు మన కుర్రాడు. నాలుగేళ్లుగా నువ్వు నాకు తెలుసని, అలా సరదాగా డేట్​కి వెళదామని ప్రపోజల్​ పెట్టాడు యువకుడు. ఈ రెజ్యూమ్​ను సదరు అమ్మాయిగారు సోషల్​మీడియా(social media) లో పెట్టడంతో తెగ వైరల్​ అవుతోంది.

Alsio Read: నేచర్ లవర్స్ : నగ్నంగా బ్రతికేస్తున్న దంపతులు..వీరికి అలానే ఇష్టమట!

టెక్నాలజీ అభివృద్ధి చెంది..యువత కోసం చాలా డేటింగ్ యాప్స్(Dating Apps) కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి(student) కొత్తగా ట్త్రై చేశాడు. శాన్ డియాగో యూనివర్శిటీలో చదువుతున్న జేమ్స్.  అదే యూనివర్శిటీకి చెందిన క్రిష్టిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు(loving). ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ పూర్తి కాబోతోంది. దీంతో  హైరానా పడ్డ యువకుడు.. దైర్యం చేసి తన మనసులోని మాటను ఆమె ముందు బయటపెట్టాడు. 

అయితే ఆ అమ్మాయి ఫన్నీగా అతనికి ఓ విషయం చెప్పింది. నిజంగా నన్ను డేటింగ్‌(Dating)కు ఆహ్వానించాలనుకుంటే . . ఓ కవర్ లెటర్(letter) పంపించమని కోరింది. దీనికి జేమ్స్ ఏకంగా తన రెజ్యూమ్‌నే ఆ అమ్మాయికి పంపించాడు. రెజ్యూమ్‌లో తన హైట్, వెయిట్, చదువుతోపాటు, పాత గర్ల్ ఫ్రెండ్స్ వివరాలు కూడా పొందు పరిచాడు. అయితే జేమ్స్ పంపిన రెజ్యూమ్‌ను చూసి నవ్వుకున్న క్రిస్టినా.. దాన్ని యథాతథంగా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News