Python Video: భారీ కొండచిలువను అలవోకగా పట్టేసిన మహిళ.. ఏంటి తల్లి నీ ధైర్యం..!

Python Viral Video in Instagram: ఓ మహిళ భారీ కొండ చిలువను అలవోకగా పట్టేసింది. చేతులతో కొండచిలువను పట్టుకుని ఫొటోలను పోజులివ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 11:29 PM IST
Python Video: భారీ కొండచిలువను అలవోకగా పట్టేసిన మహిళ.. ఏంటి తల్లి నీ ధైర్యం..!

Python Viral Video in Instagram: రీసెంట్‌గా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్నేక్ క్యాచింగ్ వీడియోలు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది అబ్బాయిలే స్నేక్ క్యాచింగ్‌లో నైపుణ్యం సంపాదించుకోగా.. అమ్మాయిలు కూడా తామే తక్కువ కాదన్నట్లు దూసుకువస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ఎంత పెద్ద పాములనైనా ఇట్టే పట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా ఓ భారీ కొండ చిలువను పట్టేసింది. @shital_kasar_official_ అనే అకౌంట్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను సషేర్ చేయగా.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. భారీ కొండ చిలువను పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ వీడియోపై నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. 3 వేలకు పైగా లైక్‌లను సంపాదించిన ఈ ఫుటేజ్‌లో భారీ కొండ చిలువను ఓ మహిళ అలవోకగా పట్టుకుంది. మహిళ కొండ చిలువను అంత ఈజీగా ఎలా పట్టుకుందని షాక్‌కు గురవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వీడియోను వీక్షించిన తర్వాత కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shittu💎𓆗 (@shital_kasar_official_)

"అయ్యో.. ఆ కొండ చిలువను చూస్తుంటే నా కలలోకి వచ్చి భయపెట్టేలా ఉంది. ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే." ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా..? అంత భయంకరమైన కొండ చిలువను ఎలా పట్టుకుంది. ఆమె చేసే పనిని తెలివిగల వ్యక్తి ఎవరూ చేయరు" అని మరో వినియోగదారుడు అన్నాడు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. ఎక్కువ మంది ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. "నువ్వు నా హీరో" అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News