Snakes Romance On Road Video Watch Now: సాధారణంగా మనుషులకు పాములంటే భయం.. కొన్ని పాములకు మనుషులంటే కూడా భయం.. కొందరైతే పాము కనిపించిందంటే చాలు కేకలు వేస్తూ అర కీలోమీటర్ పరిగెడుతూ ఉంటారు. అయితే ఇలా బయపడే జనాలు పాముల వీడియోలు మాత్రం వదలకుండా చూస్తారు. అందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటున్నాయి. చాలా మంది నెటిజన్స్ ఎంతో ప్రమాదకరమైన పాములనే చూస్తున్నారు. దీంతో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే వైరల్ అవుతున్న రెండు పాములకు సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాములు ఇలా వింతగా ప్రవర్తించడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఎముందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విడియో వివరాల్లోకి వెళితే రెండు పామలు గాలిలో సగం పైకి లేచి నాగిని డ్యాన్స్ ఆడడం చూడవచ్చు. ఇలా రెండు పాములు చాలా అరుదుగా నృత్యం చేస్తాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
रियल नाग नागिन का नृत्य 👌 pic.twitter.com/HPEWYvMj8i
— Disha Rajput (@DishaRajput24) December 9, 2024
రెండు పాములు మొదట పొదల్లో ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా గమనించవచ్చు. అందులో నుంచే క్రమంగా బయటికీ రావడం కూడా చూడవచ్చు. అంతేకాకుండా మరో విధంగా ఈ వీడియోను చూస్తే ఆ రెండు పాములు ఒకదానికి ఒకటి రెండు ఆగ్రహంతో దాడి చేసుకోవడం గమనించవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన X హ్యాండిల్ @DishaRajput24 ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనిని 'రియల్ నాగ్ నాగిన్స్ డ్యాన్స్' అనే క్యాప్షన్ పేరుతో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను దాదాపు 4 లక్షలకుపైగా నెటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియోకి కొన్ని వేల మంది కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. కొంతమందైతే ఈ పాముల వీడియోలను చూసి.. స్నేక్ రొమాన్స్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook