Viral Video, Black King Cobra eats Python very easily: ఆకలితో ఉంటే మనుషులు అయినా సరే.. ముందు ఏదున్నా కడుపులో పడేస్తారు. నచ్చని పదార్థం అయినా ముందువెనక చూడకుండా తినేస్తారు. ఆకలితో ఉన్న సింహం కూడా భారీ సైజు దున్న కనిపిస్తే.. వేటాడి మరీ తినేస్తుంది. ఆకలి అయితే చిన్న జంతువులు కూడా పెద్ద వాటిపై దాడి చేయడానికి వెనకాడవు. అలానే ఆకలితో అలమాటాడిన ఓ భారీ కింగ్ కోబ్రా.. అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను అమాంతం మింగేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఇద్దరు పాము సంరక్షకులు భారీ కింగ్ కోబ్రా (కింగ్ కోబ్రా పేరు టాకో)ను దాని బాక్స్ నుంచి బయటికి తీస్తారు. అది అన్ని పాములను తింటుందట. చనిపోయిన ఓ సాధారణ సైజు ఉన్న ఓ కొండచిలువను దాని ముందు పెట్టారు. బాగా ఆకలితో ఉన్న కింగ్ కోబ్రా.. ఒక్కసారిగా దాన్ని పట్టుకుంటుంది. చాలా సమయం నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా.. ఆపై కొండచిలువను నెమ్మెదిగా మింగడం ప్రారంభించింది. చాలా సమయం తర్వాత కొండచిలువను కింగ్ కోబ్రా పూర్తిగా మింగేసింది.
కొండచిలువను మింగేసిన కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోని బ్రియాన్ బార్జిక్ 'Brian Barczyk' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. 'కొండచిలువను తిన్న కింగ్ కోబ్రా' అని క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి ఈ వీడియో గత జులైలో పోస్ట్ చేసినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 1,063,597 వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన వారు అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాపం కింగ్ కోబ్రా ఆకలితో ఉందోఏమో, ఒళ్లు గగుర్పొడిచే వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.