karnataka traffic police punushment to drivers video: చాలా మంది రోడ్ల మీద ఇష్టమున్నట్లు వాహనాలు నడిపిస్తుంటారు. కొంత మంది పెద్దగా హరన్ మోగిస్తు హల్ చల్ చేస్తుంటారు. మరికొందరు ఇష్టమున్నట్లు రాంగ్ రూట్లలో వాహనాలు నడిపిస్తుంటారు. అంతే కాకుండా..రోడ్లపై వెళ్తు ఇతరుల వాహానాలకు యాక్సిడెంట్ చేస్తుంటారు. తప్పతాగి వాహనాలను నడిపిస్తుంటారు.
చాలా మందికి వాహనాలు సరిగ్గా నడిపించడం రాకున్న కూడా.. బైటకు తీసి ఇతరుల ప్రాణాలు పోయేందుకు కారణమౌతుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు కూడా వాహనాలు జాగ్రత్తగా నడిపించాలని చెప్తుంటారు. ట్రాఫిక్ నియమాలను వయోలేట్ చేయోద్దని అవగాహన కల్పిస్తుంటారు.
పెద్ద శబ్దాలు వచ్చే హరన్ పెట్టుకొని తిరుగుతున్న బస్సు డ్రైవర్లకు అదే శిక్ష వేసిన కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు
పెద్ద శబ్దాల హారన్‌తో ఇబ్బందులు పెడుతున్న వారికి తగిన శిక్ష వేశారని ట్రాఫిక్ పోలీసులను మెచ్చుకున్న ప్రజలు pic.twitter.com/qcN0nIBE78
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025
కానీ కొంత మంది తాగి ట్రాఫిక్ రూల్స్ ను వయోలేట్ చేస్తుంటారు. చాలా మంది పోలీసులు ట్రాఫిక్ వయోలేట్ చేసిన వాళ్లకు వెరైటీగా పనిష్మెంట్ లు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు...
కర్ణాటకలో ఇటీవల కొంత మంది వాహన దారులు ఎక్కువగా రోడ్ల మీద ఇష్టమున్నట్లు వాహనాలను నడిపిస్తు.. హరన్ లు కొడుతూ... ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా.. వీరు హరన్ లు మోగించడం వల్ల.. పాదాచారులు, టూవీర్ వాళ్లు భయంతో కొన్నిసార్లు తమ వాహానాల నుంచి కింద పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు కొంత మంది డ్రైవర్ లకు వెరైటీగా పనిష్మెంట్ ఇచ్చారు.
వీళ్లు ఏవిధంగా అయితే.. భారీ శబ్దాలు చేసి ఇతరుల్ని ఇరిటేట్ చేస్తారో.. అదే విధంగా వీళ్లను కూడా.. పెద్దగా హరన్ లను మోగించి.. దాని ముందు వీళ్లను కూర్చొబెట్టి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ముల్లును ముల్లుతోనే తీసేలా పోలీసుల ఐడియా భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు చేసిన పని వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter